తండ్రిగా చాలా ఆనందంగా ఉంది: ఎమ్మెస్ రాజు
on Sep 4, 2013

ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన తాజా చిత్రం "అంతకు ముందు ఆ తరువాత". ఇటీవలే ఈ చిత్రం విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్ర విజయంపై ఎమ్మెస్ రాజు తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "సుమంత్ అశ్విన్ తొలి చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినా, ఒక మంచి కథకు హీరోగా ఎంచుకున్న దర్శక నిర్మాతలకు ముందుగా థాంక్స్ చెపుతున్నాను. మంచి స్క్రిప్ట్ తో ఇంద్రగంటి మావద్దకొచ్చారు. కథ విన్నవెంటనే నచ్చింది. అదే ఇపుడు జనాలు కూడా ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది ఈ సినిమా. చుసిన వారందరూ కూడా బాగుంది అంటుంటే సుమంత్ అశ్విన్ తండ్రిగా చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



