Annagaru vostharu Review: అన్నగారు వస్తారు మూవీ రివ్యూ
on Jan 29, 2026

మూవీ : అన్నగారు వస్తారు
నటీనటులు: కార్తీ, కృతిశెట్టి, సత్యరాజ్, శిల్ప మంజునాథ్, ఆనందరాజ్, కరుణాకరన్ తదితరులు
ఎడిటింగ్: వెట్రి క్రిష్ణన్
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
నిర్మాతలు: కె. ఈ జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం: నలన్ కుమారస్వామి
ఓటిటి: అమెజాన్ ప్రైమ్ వీడియో
కార్తీ, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో సత్యరాజ్ విలన్ గా నటించిన ఈ 'అన్నగారు వస్తారు' మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
రామారావు(కార్తీ) వాళ్ళ తాతయ్య(రాజ్ కిరణ్) ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో MGR కి పెద్ద ఫ్యాన్. MGR చనిపోయిన రోజే తన మనవడు పుట్టడంతో అన్నగారి అంశతోనే పుట్టాడని ఆయన సినిమాలు చూపిస్తూ మంచి మార్గంలో పెంచుతుంటాడు. లాటరీలో వచ్చిన డబ్బులు కూడా వద్దు, కష్టపడాలని రామారావుకు చిన్నప్పుడు తాతయ్య చెప్పడంతో అది నచ్చక రామారావు మారిపోయి అందరిలానే ఉన్నా తాతయ్యకు ఈ విషయం తెలియకుండా మంచివాడిలా నటిస్తాడు. రామారావు పెద్దయ్యాక ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అనుకోకుండా అతను తీసుకున్న లంచం వల్ల సస్పెండ్ అవుతాడు. ఈ విషయం తాతయ్యకు తెలియకూడదని జాగ్రత్త పడతాడు రామారావు. ఇదే సమయంలో పెద్ద బిజినెస్ మెన్ భక్తవత్సలం(సత్యరాజ్) జనాలకు, పర్యావరణానికి హాని తలపెట్టే ఏదో ప్రాజెక్టు మొదలుపెడతాడు. అయితే ఈ ప్రాజెక్టుని జనాలు వ్యతిరేకిస్తుంటారు. భక్తవత్సలంకు చెందిన ఓ సీక్రెట్ పసుపు ముఖం అనే టీమ్ హ్యాక్ చేసి బయటపెడుతోంది. ఇదే క్రమంలో రామారావు భక్తవత్సలం కూతుర్ని ఓ కేసులో కాపాడి అతనికి దగ్గరయి ఈ పసుపు ముఖం పట్టుకునే టీమ్ లో జాయిన్ అవుతాడు. మరి రామారావు మంచోడిగా మారతాడా? అసలు పసుపు ముఖం టీమ్ ఎవరు? వాళ్ళని రామారావు పట్టుకుంటాడా? అసలు భక్తవత్సలం చేసే ప్రాజెక్టు ఏంటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
హీరోల మీద అభిమానంతో ఎంతోమంది తమ పిల్లలకి వారి పేర్లుని పెడుతుంటారు. అలా గొప్పగా అవ్వాలని వాళ్ళు భావిస్తారు. అలాగే ఈ సినిమాలో తమిళ్ ఫేమస్ నటుడు 'MGR' అంటే తాతయ్య(రాజ్ కిరణ్) కి ఇష్టం. అందుకే తన మనవడికి రామారావు(కార్తీ) అనే పేరు పెడతాడు. ఇక MGR లాగా గొప్పవాడివి అవ్వాలి.. కష్టపడాలి అని మనవడికి తాతయ్య చెప్తాడు. కానీ అతను పెద్దయ్యాక లంచాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కానీ తాతయ్యకి తెలిసిపోతుంది. ఇది స్టోరీ.. కానీ దీనిని పక్కకి పెట్టి పసుపు ముఖం అనే టీమ్, బిజినెస్ మెన్ భక్తవత్సలం, హీరోయిన్ ఊ.. వీళ్ళంతా ఎందుకు.. అసలు కథకి వీరికి సంబంధమేంటి.. దర్శకుడు కథని గందరగోళం చేశాడు.
కథని అర్థం చేసుకోవాలంటే ఆడియన్ కి మినిమమ్ డిగ్రీ కావాలి.. కాదు కాదు పిహెచ్ డీ కావాలి. సినిమాలో మొదటి పది నిమిషాలు మినహాయిస్తే ఎక్కడా కూడా బాగోదు. మొదటి అరగంటలో మూడు పాటలు.. సెకంఢాఫ్ లో రెండు పాటలు.. హీరోయిన్ ని పాటల్లో డ్యాన్స్ చేయడం కోసమే తీసుకున్నట్లుగా ఉంది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే మరో ఇరవై నిమిషాల్లో సినిమా పూర్తవుతుందనగా అప్పుడు ఒక పాట ఉంటుంది. అసలు క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా లేదు.
అన్నగారు వచ్చారు అనే లైన్ ని తీసుకొని.. హీరోని మల్టీ పర్సనల్ డిసార్డర్ లాగా చూపించారు. అపరిచితుడు సినిమాలో రాము పాత్రలా చేద్దామని అనుకున్నారు కానీ అది లాజిక్ లేకుండా ఉంది. ఎంచుకున్న కథా వస్తువు బాగున్నప్పటికి దానిని ప్రెజెంట్ చేయటంలో దర్శకుడు తడపడ్డాడు. హీరోయిన్ ని అసలు స్కోప్ లేదు. అయినా బలవంతంగా రాసుకొచ్చినట్టుగా ఆ పాత్ర ఉంటుంది. విలన్ ఎందుకున్నాడో అర్థం కాదు.
ఫస్టాఫ్ సాంగ్స్, సెకెంఢాఫ్ ఫైట్లు.. సినిమాలో ఏం లేదు.. డొల్ల. కథకి స్క్రీన్ మీద వస్తున్న పాత్రలకి సంబంధం లేదు. అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. అశ్లీల పదాలు వాడలేదు. ఎంగేజింగ్ అటుంచి ఎంటర్టైన్మెంట్ లేదు. కామెడీ లేదు. మ్యూజిక్ బాలేదు. బిజిఎమ్ పెద్దగా ఏం లేదు. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
తాతయ్య పాత్రలో రాజ్ కిరణ్, మనవడిగా కార్తీ తమ పాత్రలకి న్యాయం చేశారు. భక్తవత్సలంగా సత్యరాజ్ ఆకట్టుకున్నాడు. మిగతావారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా : డిస్సప్పాయింటెడ్ మూవీ. అన్నగారు రాలేదు..
రేటింగ్: 1.75 / 5
✍️. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



