
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా సోషల్ మీడియా (ఇన్ స్టాగ్రామ్) వేదికగా అభిమానులతో అందుబాటులో ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుండంతో పాటు పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా తన సోషల్ మీడియా ఖాతాని డీయాక్టివేట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది . ఆమె తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటనే దానిపై నెట్టింట రకరకాల ఊహాగానాలు, చర్చలు జోరుగా సాగుతున్నాయి. సాధారణంగా పబ్లిక్ లైఫ్, మీడియా ప్రచారానికి చాలా దూరంగా, అత్యంత ప్రశాంతమైన వ్యక్తిగత జీవితాన్ని గడపడానికి ఇష్టపడే అన్నా కొణిదెల, గతంలో అన్నా లెజినోవా పేరుతో అందరికీ సుపరిచితురాలయ్యారు. ఆ తర్వాత కాలంలో తన పేరుని అధికారికంగా అన్నా కొణిదెలగా మార్చుకుని, మెగా అభిమానులతో పాటు జనసామాన్యంతో మరింత దగ్గరగా మెలగాలనే ఉద్దేశంతో సరిగ్గా 2026 మార్చి నెలలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టారు.
ఇది కూడా చదవండి: హీరో అవ్వకముందే గౌతమ్ కి యాంటీ ఫ్యాన్స్: వాళ్ళు వీళ్లేనా!

అంతేకాకుండా తనని అందరు ఇకపై 'అన్నా కొణిదెల' అని మాత్రమే పిలవాలని కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రత్యేకంగా కోరారు. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా, పోస్ట్‌లకి విపరీతమైన స్పందన లభించింది. అయితే ఇంతలోనే హఠాత్తుగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిజిటల్ ప్రపంచంలో కనిపించకుండా పోవడం మెగా, పవన్ అభిమానుల్లో, నెటిజెన్స్ లో షాకింగ్ న్యూస్ గా మారింది.
[Anna Konidela Instagram Deactivated, Anna Konidela, Pawan Kalyan wife, Anna Lezhneva Instagram, Anna Konidela deactivated, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]






