Home

»

Latest News

Anil Ravipudi: అనిల్ రావిపూడి మూవీ స్టోరీ లీక్..!

Mar 26, 2026

  • వచ్చే సంక్రాంతికి బావ బావమరుదుల రచ్చ
  • వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ స్టోరీ ఇదేనా?
  • అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేశాడు?

విక్టరీ వెంకటేష్(Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారెంటీ ఎంటర్‌టైన్‌మెంట్. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన 'F2', 'F3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించాయి. ముఖ్యంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా భారీ వసూళ్లతో సంచలన విజయం సాధించింది. 

ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) కూడా నటిస్తుండటం విశేషం. దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్, అలాగే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన వెంకటేష్.. వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూపించడం ద్వారా ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వాలని అనిల్ రావిపూడి చూస్తున్నాడు. 

వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బావమరుదులుగా కనిపిస్తారని, వారి మధ్య వచ్చే ఫన్ సీన్స్ సినిమాకే హైలైట్ అని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి కేవలం నవ్వించడమే కాకుండా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా జోడిస్తున్నారట. బావ బావమరుదుల మధ్య ఉండే బంధం, అనుబంధాల చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. పాత తరం సినిమాల్లో ఉండే స్వచ్ఛమైన వినోదాన్ని మళ్ళీ గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందట.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కాస్టింగ్ విషయంలో ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్‌ను, అలాగే కళ్యాణ్ రామ్ జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణ్ రామ్ సరసన కయదు లోహర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com