అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్.. దగ్గుబాటి హీరోతో కాదు!
on Jan 29, 2026

'మన శంకర వరప్రసాద్ గారు'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఇదే ఉత్సాహంతో తన తదుపరి సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. ఇదొక మల్టీస్టారర్ అని.. దగ్గుబాటి హీరోలు వెంకటేష్ (Venkatesh), రానా కలిసి నటిస్తారని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు రానాకు బదులుగా వేరే హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.
అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడు. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ లో వెంకటేష్ తో పాటు మరో హీరో నటిస్తాడని తెలుస్తోంది. మొదట రానా దగ్గుబాటి పేరు వినిపించినా.. ఇప్పుడు కార్తీ లేదా ఫహాద్ ఫాజిల్ నటించే ఛాన్స్ ఉందని వినికిడి. కార్తీ నటించడానికి ఎక్కువ అవకాశముందని సమాచారం.
వెంకటేష్ కి మల్టీస్టారర్స్ కొత్త కాదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్, నాగ చైతన్య, వరుణ్ తేజ్ వంటి ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక కార్తీ కూడా నాగార్జునతో కలిసి 'ఊపిరి' సినిమా చేశాడు.
వెంకటేష్ లాగే కార్తీ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఈ ఇద్దరు స్క్రీన్ పై కనిపిస్తే సందడిగా ఉంటుంది. అందుకే ఈ కాంబోని సెట్ చేసే పనిలో అనిల్ ఉన్నాడట.
Also Read: షాకిచ్చిన రాజమౌళి.. 'వారణాసి' రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



