నాగ చైతన్య పై అమీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు..లాల్ సింగ్ చద్దా గుర్తుంది కదా
on Jan 31, 2025
భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రభావంతమైన నటుల్లో అమీర్ ఖాన్(Amir Khan)కూడా ఒకడు.1973 లో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అమీర్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్, గా,ఆ పై నటుడు గా మారి తన అద్భుతమైన నటనతో లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు.
నాగ చైతన్య,(Naga Chaitanya)సాయి పల్లవి(Sai Pallavi)కాంబోలో తెరకెక్కిన తండేల్(Thandel)ఫిబ్రవరి 7 న రిలీజ్ అవుతుండగా హిందీ రిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్స్ ఈ రోజు ముంబై లో జరిగాయి.ఈ ఈవెంట్ కి అమీర్ ముఖ్య అతిధిగా హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా నాగ చైతన్య ని ఉద్దేశించి అమీర్ మాట్లాడుతు చైతు అమేజింగ్ యాక్టర్.సాయిపల్లవి కూడా చాలా మంచి నటి, ట్రైలర్ కూడా చాలా బాగుంది.మూవీ తప్పని సరిగా హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.చైతు,అమీర్ ఖాన్ కలిసి గతంలో 'లాల్ సింగ్ చద్దా' లో నటించారు. 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ పరాజయాన్ని అందుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
