అమరన్ ఓటిటి డేట్ వచ్చేసింది..ప్రేక్షకులకి పండుగే
on Nov 30, 2024
శివకార్తికేయన్(siva karthikeyan)సాయిపల్లవి(sai pallavi)జంటగా దివాలి కానుకగా అక్టోబర్ 30 న ప్రేక్షకుల ముందు వచ్చిన మూవీ అమరన్(amaran). తమిళనాడుకి చెందిన దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్(major mukund varadarajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవ్వగా అన్ని భాషల్లోను మంచి విజయాన్ని నమోదు చేసింది.కలెక్షన్స్ పరంగా కూడా సరికొత్త రికార్డ్స్ ని సృష్టించింది
ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లో నెట్ ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.తమిళ,తెలుగు మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారకంగా వెల్లడి చేసింది.దీంతో ఎప్పట్నుంచో అమరన్ ఓటిటి విడుదల కోసం చూస్తున్న ప్రేక్షకులని ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.మరి ఓటిటి వేదికగా ఎన్ని రికార్డులు అందుకుంటుందో చూడాలి.
చిన్న తనం నుంచే ఇండియన్ ఆర్మీ లో పని చెయ్యాలని కలలు కన్న ముకుంద్ అనే వ్యక్తి ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడు, అతని కాలేజీ లైఫ్ ఎలా సాగింది,అక్కడ పరిచయమైన ఇందు రెబెకా తో తన ప్రేమ పెళ్లి ఎలా జరిగింది! ఆ తర్వాత దేశ శత్రువులతో పోరాడి ఎలా అసువులు బాసాడనేది ఈ చిత్రంలో చుపించాడు, ముకుంద్, ఇందు పాత్రల్లో శివ కార్తికేయన్, సాయి పల్లవి జీవించారని చెప్పవచ్చు.కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించగా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వాన్ని అందించాడు.