బన్నీ అక్కడా దున్నేస్తున్నాడు
on Apr 25, 2015
మలయాళంలో అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేద్దు. ఇక్కడ యావరేజ్‌గా ఆడిన బన్నీ సినిమాలు కూడా అక్కడ హిట్టయ్యాయి. ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తి కూడా మలయాళంలో హిట్టయ్యే ఛాన్సులున్నాయి. శుక్రవారం ఈ సినిమా మలయాళంలో విడుదలైంది. మలయాళంలో పేరున్న హీరోల సినిమాలకు చేసే పబ్లిసిటీ ఈ సినిమాకీ చేశారు. బన్నీ స్వయంగా వెళ్లి అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు. తొలి రోజు అన్నిచోట్లా హౌస్‌ఫుల్ వసూళ్లు అందుకొందీ చిత్రం. బన్నీ, నిత్యమీనన్, ఉపేంద్ర, స్నేహా.. వీళ్లంతా అక్కడ తెలిసిన మొహాలే. అందుకే ఈ సినిమాకి అన్ని కలెక్షన్లొచ్చాయి. తొలి రోజు మలయాళంలో ఈ సినిమాకి రూ.3 కోట్ల వరకూ వసూళ్లు దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది.