అరెస్ట్ పై అల్లు అర్జున్ ఏం చెప్పాడు..పవన్ కళ్యాణ్ కలవబోతున్నాడా!
on Dec 14, 2024
సంధ్య థియేటర్ లో జరిగిన రేవతి మరణం కేసులో అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యి రాత్రంతా చంచల్ గూడ జైలులో ఉండి, ఈ రోజు ఉదయం విడుదల కావడం జరిగింది.ఇక జైలు నుంచి మొదట గీతా ఆర్ట్స్ కి వెళ్లిన అల్లు అర్జున్ ఆ తర్వాత తన ఇంటికి వెళ్లగా అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి, పిల్లలు, కుటుంబ సభ్యులందరు ఆనందంతో కళ్ళ నీళ్లు కూడా పెట్టుకున్నారు.
ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ నా అభిమానులు,శ్రేయోభిలాషులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు.మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు.చనిపోయిన రేవతి గారి కుటుంబానికి నా సానుభూతి.ఆమె ఘటన దురదృష్టకరం. ఇది అనుకోకుండా జరిగిన ఘటన, ఇరవై సంవత్సరాలుగా సినిమా చూడటానికి సంధ్య థియేటర్ కి వెళ్తున్నాను.కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి చట్టాన్నిగౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేనని చెప్పాడు.
ఇక అల్లు అర్జున్ ని కలవడానికి పలువురు సినీ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని అయన ఇంటికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నాడనేవార్తలు వస్తున్నాయి.
Also Read