అల్లు అర్జున్ విలన్ గా ట్రై చేస్తున్నాడా..?
on Jun 3, 2016
తెలుగు హీరోల పద్ధతి ఒకప్పుడు కాస్త డిఫరెంట్ గా ఉండేది. అటుపక్క తమిళ హీరోలు చిత్ర విచిత్రమైన పాత్రలు ట్రై చేస్తూ యాక్టింగ్ లో ఇరగదీసేస్తుంటే, ట్యాలెంట్ ఉన్నాగానీ మనోళ్లు అలాంటి రిస్క్ లు చేసేవాళ్లు కాదు. చొక్కా నలగకుండా క్రాపు చెరగకుండా నీట్ గా ఉండే పాత్రలు వేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. పాత్ర కోసం బరువు తగ్గడం, పెంచడం నుంచి స్టైల్ మార్చడానికి, విలన్ గా చేయడానికి కూడా మక్కువ చూపిస్తున్నారు. ఇక ఇప్పటి యంగ్ జనరేషన్ స్టార్స్ లో కొత్తగా ఏదైనా చేయాలని తపన పడేవాళ్లలో ముందుంటాడు బన్నీ. ఆర్య 2 లో చేసిన నెగటివ్ రోల్ అయినా, వేదంలో కేబుల్ రాజు క్యారెక్టర్ అయినా, రుద్రమదేవిలో చేసిన గోనగన్నారెడ్డి పాత్ర అయినా అవన్నీ బన్నీ ఇష్టపడి ట్రై చేసినవే. లేటెస్ట్ గా లింగు స్వామి తో చేయబోయే తన తర్వాతి సినిమాలో, బన్నీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఒక పాత్ర హీరోగా, మరో పాత్ర విలన్ గా ఉండబోతుందని అంటున్నారు. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ సినిమాగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. సరైనోడు సినిమా ప్రమోషన్ల సమయంలో, తనకు విలన్ పాత్రలు కూడా చేయాలని ఉందంటూ బన్నీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ కోరికను ఈ సినిమాతో తీర్చుకుంటున్నాడు బన్నీ. ఇక సరైనోడు విషయానికొస్తే, సెన్సేషనల్ హిట్ గా 70 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా కేరళలో యోధావుగా రిలీజై అక్కడ కూడా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. మళయాళంలో బన్నీ సినిమాల్లో, ఈ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్లు నమోదు చేస్తుందని భావిస్తున్నారు అక్కడి సినీ పండితులు.