Home

»

Latest News

Allu Arjun: అభిమానులకి వరం ఇచ్చిన అల్లు అర్జున్.. 5 లక్షలు, 3 లక్షలుతో...

Jul 29, 2026 11:13AM


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. ఈజీ యాక్టింగ్ కి, డాన్స్ కి  పెట్టింది పేరు. అందుకే సినిమా సినిమాకి అభిమానులని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రెజెంట్ 'రాకా'తో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న అల్లు అర్జున్ నిన్న హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోటల్ లో 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్’ (AAFA) ఆధ్వర్యంలో గ్రాండ్ సరిహద్దుల నడుమ ‘AAFA ఆన్యువల్ సమిట్ 2026’ నిర్వహించబడింది. ఈ మీటింగ్ కి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ  మహారాష్ట్ర నుండి దాదాపు 900 నుండి 1000 మంది అభిమానులు  తరలివచ్చారు. అభిమానుల కోలాహలంతో ప్రాంగణం అంతా సందడిగా మారింది. అభిమానుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించిన అల్లు అర్జున్, సుమారు  6 గంటలకు పైగా వారితో కలిసి గడిపారు. ప్రతీ ఒక్కరితో నవ్వుతూ మాట్లాడటంతో పాటు వ్యక్తిగతంగా పలకరించారు  ఫొటోలు కూడా  దిగి  అభిమానులందరికీ భోజన వసతులు ఏర్పాటు చేశాడు

ఈ సమిట్‌లో అల్లు అర్జున్ ప్రకటించిన విప్లవాత్మక నిర్ణయం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. సినిమా విడుదల సమయంలో భారీ కటౌట్లు కట్టడం, థియేటర్ల వద్ద హంగామా చేయడం, నిరంతరం ప్రచారం చేయడంలో అభిమానులు ముందుంటారు. అయితే వారి ప్రాణ రక్షణ, వారి కుటుంబాల భవిష్యత్తు ఎంతో ముఖ్యమని భావించిన అల్లు అర్జున్ , ఉచిత ప్రమాద బీమా (Accident Insurance) పథకాన్ని ప్రారంభించాడు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు, అలాగే జిల్లా కమిటీ సభ్యులకు 3 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా కవరేజీని కల్పించారు. ఇందుకు సంబంధించిన ఇన్సూరెన్స్ కార్డులను  స్వయంగా అభిమానులకి  తన చేతుల మీదుగానే ఇచ్చాడు.

అంతేకాకుండా, ఈ కార్యక్రమంలో అభిమానులకు ఒక ప్రేరణాత్మక సందేశాన్ని కూడా బన్నీ ఇచ్చారు. ప్రతీ మనిషికి సమయం, శక్తి ఒక 100 శాతం ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ లాంటిదని, ఆ శక్తిని ఇతరులపై ద్వేషం చూపించడానికి లేదా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడానికి వృథా చేయవద్దని పిలుపునిచ్చారు. ప్రతికూలతలకు దూరంగా ఉంటూ మీకు నచ్చిన పనులపై, మీ లక్ష్యాలపై ఆ శక్తిని వెచ్చించాలని హితవు పలికారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా, సామాజిక దృక్పథంతో అభిమానుల జీవితాల్లో వెలుగులు నింపేలా అల్లు అర్జున్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై సోషల్ మీడియాలో, నెటిజన్లలో మరియు సినీ వర్గాల్లో తీవ్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక హీరో తన అభిమానుల సంక్షేమం కోసం ఇలాంటి ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టడం ఇండస్ట్రీలోనే సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది.

Allu Arjun, Raaka

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com