Home

»

Latest News

Ntr: తన బావ ఎన్టీఆర్ కి విషెస్ చెప్పిన అల్లు అర్జున్..డ్రాగన్ గ్లింప్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు 

May 20, 2026 11:18AM

 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)ఒకరికొకరు బావ అని పిలుచుకుంటూ ఉంటారనే విషయం తెలిసిందే. అలాగే అప్పుడప్పుడు రెండు ఫ్యామిలీస్ కలవడంతో పాటు ఒకరి పుట్టిన రోజుకి ఒకరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొస్తారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చేసిన ట్వీట్ అన్ని బర్త్ డే ల విషెస్ కంటే వైరల్ గా మారింది.


అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా  'మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ. నీకు ఆయురారోగ్యాలు, ప్రశాంతత, అపారమైన ప్రేమ లభించాలని కోరుకుంటున్నాను. ఈసారి రాబోయేది కేవలం టైగర్ మాత్రమే కాదు ఇది ఒక భీకరమైన డ్రాగన్. ప్రతి షాట్‌లోను నిప్పులు చెరిగే గర్జన ఉండబోతోంది" అంటూ ట్వీట్ చేసాడు.  ఇప్పుడు ఈ ట్వీట్ ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది.  న్టీఆర్ అభిమానుల ఆనందానికి అయితే  అవధులు లేకుండా పోతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం 'రాకా'తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 

Also read: Ntr: ఎన్టీఆర్ కి అదిరిపోయే రేంజ్ లో బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్ 

?s=20

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com