ఈ రోజు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు..అభిమానుల్లో టెన్షన్
on Jan 3, 2025
డిసెంబర్ 4 న పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం తెలిసిందే.ఈ విషయంపై పోలీసులు అల్లు అర్జున్(allu arjun)తో పాటు చిత్ర యూనిట్, సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురి పై కేసు నమోదు చేసింది.ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రోజు జైలు లో కూడా ఉన్నాడు.
ఇక ఈ కేసులో అల్లు అర్జున్ కి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఈ రోజు తీర్పు ని ఇవ్వనుంది.ఇప్పటికే బెయిల్ పిటిషన్‌పై వాదనలు కూడా ముగిసాయి.ఇక ఈ కేసులో పుష్ప 2 ప్రొడ్యూసర్లు యలమంచిలి రవిశంకర్, నవీన్ లు సంధ్య థియేటర్ ఘటన విషయంలో తమపై నమోదయిన కేస్ ని కొట్టివేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యగా ప్రొడ్యూసర్లను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తు తదుపరి విచారణని రెండు వారాలకు వాయిదా వాయిదా వేసింది.ఇక సంధ్య థియేటర్ విషయంలో తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కి పుష్ప టీం మూడు కోట్ల రూపాయలు ఇచ్చింది.ఇక ఇదే ప్రమాదంలో గాయపడిన రేవతి కొడుకు శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో ఉండగా ఇప్పుడిప్పుడే బాబు కోలుకుంటున్నాడు .
Also Read