గోపిగారూ.. నా సినిమాకు మ్యూజిక్ ఎప్పుడిస్తారు?
on Oct 21, 2021
మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్‌ను పొగడ్తల్లో ముంచేశాడు అల్లు అర్జున్. గోపి మ్యూజిక్కు అభిమానినైపోయానని ఆయన అన్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బన్నీ గెస్ట్‌గా పాల్గొన్నాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టవగా, ఆ సినిమా సంగీతంతో గోపీ సుందర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ సినిమా పాటలు సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
బన్నీ తన ప్రసంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో "లెహరాయీ" సాంగ్ తనకు పిచ్చగా నచ్చేసిందని చెప్పాడు. అది బ్యూటిఫుల్ కంపోజిషన్‌గా పేర్కొన్నాడు. తన సినిమాకు ఎప్పుడు మ్యూజిక్ ఇస్తారని గోపి సుందర్‌ను అడిగాడు. మీ పాటలు వినకుండా తనకు ఏ రోజూ గడవదని కూడా బన్నీ చెప్పాడు. "గోపి గారూ.. ప్రతిరోజూ నా కారులో మీ పాటలు ఎన్ని వింటానో లెక్కలేదు. మీరు వండర్ఫుల్ మ్యుజీషియన్" అని ఆయన మెచ్చుకున్నాడు. తన సినిమాకు మ్యూజిక్ ఎప్పుడిస్తారని బన్నీ అడిగినప్పుడు, ఆనందంతో థమ్స్ అప్ సిగ్నల్ ఇచ్చాడు గోపి సుందర్.
కేరళకు చెందిన గోపి సుందర్ 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్, ఊపిరి, ప్రేమమ్, నిన్నుకోరి, గీత గోవిందం, మజిలీ, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ సినిమాలకు ఇచ్చిన మ్యూజిక్‌తో పాపులర్ అయ్యాడు. లేటెస్ట్గా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లోని "లెహరాయీ" సాంగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు.
Also Read