విలన్ గా అల్లు అర్జున్.. మరి హీరో..?
on Mar 23, 2025
ఇటీవల స్టార్ హీరోలు కూడా నెగెటివ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. విలన్ గాను నటిస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్, యశ్ వంటి స్టార్స్ చేరారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ లిస్టులో చేరబోతున్నాడని తెలుస్తోంది. (Allu Arjun)
పుష్ప-2 తో సంచలనం సృష్టించిన్ అల్లు అర్జున్.. తన తదుపరి సినిమాని అట్లీ దర్శకత్వంలో చేయనున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ మూవీని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఈ సినిమాకి సంబంధించి రోజుకో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. తాజాగా మరో సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. హీరోగా, విలన్ గా రెండు విభిన్న పాత్రల్లో అలరించడానికి సిద్ధమవుతున్నాడట. అంటే అట్లీ సినిమాలో బన్నీ తనని తానే ఢీ కొట్టబోతున్నాడు అన్నమాట.
పుష్పలో అల్లు అర్జున్ పోషించిన పాత్రలో కొన్ని నెగెటివ్ ఛాయలు కనిపిస్తాయి. కానీ, పూర్తిస్థాయి విలన్ గా నటిస్తున్న మొదటి సినిమా ఇదే. పుష్పతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. ఇప్పుడు హీరోగా, విలన్ గా డ్యూయల్ రోల్ లో కనిపించి నటునిగా ఇంకెన్ని ప్రశంసలు అందుకుంటాడో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
