అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్.. అమెరికాలో షూట్!
on Apr 6, 2025
'పుష్ప-2'తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ (Allu Arjun) తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే చాలా సమయం పడుతుంది. అందుకే ఈ లోపు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో బన్నీ ఉన్నాడు. (AA 22)
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు. అది కూడా యూఎస్ షూట్ చేసిన స్పెషల్ వీడియోతో ఈ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ వీడియో ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ లా ఉంటుందట. అనౌన్స్ మెంట్ వీడియోకే ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తే, ఇక సినిమాని ఏ రేంజ్ లో తీస్తారో చూడాలి.
సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా సమంత పేరు వినిపిస్తోంది. అనిరుధ్ సంగీతం అందించే అవకాశముంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
