అల్లు అర్జున్, అట్లీ మూవీ.. ఆ వార్తల్లో నిజం లేదు!
on Mar 21, 2025
'పుష్ప-2'తో సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ, దాని కంటే ముందు.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు.
బన్నీ-అట్లీ కాంబినేషన్ ఫిల్మ్ ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అయితే బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్లు కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సన్ పిక్చర్స్ తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్ట్ దిల్ రాజు లేదా ఇతర నిర్మాత చేతిలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.
అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ సన్ పిక్చర్స్ బ్యానర్ లోనే రూపొందనుందట. ప్రస్తుతం బన్నీ, అట్లీ దుబాయ్ లో స్టోరీ సిట్టింగ్స్ లో ఉన్నారని, ఇంకో రెండు వారాలు అక్కడే ఉంటారని సమాచారం. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
అట్లీ ప్రాజెక్ట్ ని వేగంగా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత పారలల్ గా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో బన్నీ ఉన్నట్టు వినికిడి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
