ఫేవరేట్ నటి పేరును క్షణంలో మార్చేసిన అల్లు అర్హ!
on Mar 25, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ సూపర్ క్యూట్ మాత్రమే కాదు, సూపర్ నాటీ కూడా! నాలుగేళ్ల వయసులోనే సోషల్ మీడియాను ఏలేస్తోంది ఈ అల్లరి పిల్ల. సందేహం లేదు.. వాళ్ల నాన్న తరహాలోనే ఆమె కూడా పాపులర్ అయిపోతోంది. అందుకే పాపరాజ్జి ఫేవరేట్‌గా ఆమె పేరు తెచ్చుకుంది. లేటెస్ట్‌గా తన ఫేవరేట్ యాక్ట్రెస్‌ను క్షణంలో మార్చేసి తన నాటీనెస్‌ను రుజువు చేసుకుంది అర్హ.
అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మొదట తన ఫేవరేట్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అని చెప్పిన అర్హ, ఆ వెంటనే మాట మార్చేసి అలియా భట్ అని చెప్పడం నవ్వులు కురిపిస్తోంది. ఎందుకంటే ఆమె అలా పేరు మార్చేయడానికి కారణం అలాంటిది! తన అమాయకత్వం (అల్లరితనమా!)తో అర్హ అందరి హృదయాలనూ కొల్లగొట్టేస్తోంది.
ఆ వీడియోలో మొదట నీ ఫేవరేట్ యాక్ట్రెస్ ఎవరని అడిగిన ప్రశ్నకు "జాక్వెలిన్ ఫెర్నాండెజ్" అని ముద్దుముద్దుగా చెప్పింది అర్హ. స్పెల్లింగ్ చెప్పమని అడగ్గానే, వెంటనే "అలియా భట్" అని తన ఫేవరేట్ యాక్ట్రెస్‌ను మార్చేసింది. అర్హ అలా చెప్పిన తీరు చూస్తే మనకు నవ్వాగదు. గతంలో దోశ స్టెప్పులతో మనల్ని అలరించిన అర్హ 2016లో నవంబర్ 21న బన్నీ-స్నేహ కపుల్‌కు రెండో బిడ్డగా పుట్టింది.
అల్లు అర్జున్ విషయానికి వస్తే, ప్రస్తుతం అతను సుకుమార్ డైరెక్షన్‌లో 'పుష్ప' మూవీ చేస్తున్నాడు. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్. మలయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తోన్న ఈ మూవీ ఐదు భాషల్లో ఆగస్ట్ 13న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్నది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
