అల్లు అరవింద్ నిర్ణయాన్ని విభేదించిన చిరు
on Apr 25, 2018

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరు ఇండస్ట్రీ లో ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు చర్చించేందుకు మీట్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి స్వతహాగా అందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. దాదాపు ఆహ్వానం అందిన ప్రతి ఒక్క హీరో ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. అల్లు అరవింద్ ఇంకొందరు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున ఈ మీటింగ్ కి విచ్చేసారు. కొన్ని టీవీ చానెల్స్ ఇండస్ట్రీ వాళ్లపై చేస్తున్న ఇబ్బందికర ప్రోగ్రామ్స్ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. కొందరు, కొన్ని టీవీ చానెల్స్ ని బాయికాట్ చేద్దామని ప్రపోజల్ పెడితే, ఇంకొందరు కొన్ని ఎందుకు అన్ని బ్యాన్ చేస్తే బెటర్ అనే అభిప్రాయం వెలిబుచ్చారట. అయితే, అల్లు అరవింద్ మాత్రం మొదటి నుండి చానెల్స్ ని బ్యాన్ చేస్తే బెటర్ అని చెబుతూ వస్తున్నారు. కొన్ని చానెల్స్ యాడ్స్ విషయంలో బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని వాటిని బాయికాట్ చేస్తేనే నిర్మాతలకు మేలు జరుగుతుందని చెప్పారట. కానీ, చిరంజీవి మాత్రం చానెల్స్ ని బ్యాన్ చేయడం సరయిన నిర్ణయం కాదని అన్నారట. ఎప్పుడూ అల్లు అరవింద్ కి సపోర్ట్ గా ఉండే చిరంజీవి ఈ సారి ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఆశ్చర్యకర విషయమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



