మ్యూజికల్ నైట్ తెచ్చిన తంటా.. అలా కేసులు నమోదయ్యాయి
on Jan 9, 2020
అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా మ్యూజికల్ నైట్ వేడుకను ఏర్పాటు చేసిన నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. ఈనెల 6న జరిగిన సినిమా మ్యూజికల్ నైట్ వేడుక సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వేడుకకు అనుమతి తీసుకున్న దానికన్నా ఎక్కువ మందికి పాసులు ఇవ్వడం, కార్యక్రమం రాత్రి 11:30 గంటలకు వరకు కొనసాగడంతో ఈ మేరకు కేసులు నమోదు చేశారు. 6 వేల మందికి గాను 15 వేల మందిని ఆహ్వానించడంతో పాటు.. రాత్రి 10 గంటలకు ముగించాల్సిన కార్యక్రమాన్ని 11:30 వరకు కొనసాగించారు. దీంతో శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ గణేష్‌పై కేసులు నమోదు అయ్యాయి. మరి దీనిపై అల వైకుంఠపురంలో యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా అల వైకుంఠపురంలో సినిమా ఈనెల 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.