అఖిల్ రెండో సినిమాకు మరో ట్విస్ట్..!
on May 23, 2016
ఇండస్ట్రీలోకి ఎంటరవుతూ తన తొలి సినిమానే భారీ డిజాస్టర్ ను చూశాడు అక్కినేని అఖిల్. ఇది ఒకరకంగా అక్కినేని సెంటిమెంట్ గా వర్కవుట్ అయినట్టే. నాగార్జున తొలి సినిమా విక్రమ్ అంతంత మాత్రంగానే ఆడింది. అయితే ఆ తర్వాత నాగ్ కెరీర్ ఎలా సాగిందో తెలిసిందే. నాగచైతన్య తొలి సినిమా జోష్ కూడా భారీ డిజాస్టర్. అయితే ఆ తర్వాత చైతూ కూడా ఇండస్ట్రీలో మంచి హిట్సే కొట్టాడు. సో అఖిల్ కు సెంటిమెంట్ గా మొదటి సినిమా డిజాస్టర్ కూడా చాలా ప్లస్సే. అయితే ఇప్పుడు తన రెండో సినిమా గురించి మాత్రం చాలా రూమర్స్ వస్తున్నాయి. అఖిల్ ను డైరెక్ట్ చేస్తారంటూ చాలామంది పేర్లు వినబడినా, చివరికి నాగ్ కు ఊపిరి లాంటి క్లాస్ హిట్టిచ్చిన వంశీ పైడిపల్లిని డైరెక్టర్ గా ఫిక్సయ్యారు. తాజాగా అఖిల్ రెండో సినిమా టాపిక్ లో మరో కొత్త దర్శకుడి పేరు వినిపిస్తోంది. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలు డైరెక్ట్ చేసిన హను రాఘవపూడికి అఖిల్ రెండో సినిమాను దర్శకుడిగా తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అఖిల్ సినిమాపై రూమర్స్ మరీ ఎక్కువవుతున్న నేపథ్యంలో, అక్కినేని అండ్ కో ఎవరిని దర్శకుడిగా తీసుకుంటారో చూడాలి.
Also Read