అక్కినేని ఫ్యామిలీని వదిలే సమస్యే లేదు..!
on Jun 2, 2017

టబు..అప్పట్లో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ముంబై భామ. టాలీవుడ్ టాప్ స్టార్లందరితో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 40 ప్లస్‌లో కూడా చెక్కు చెదరని అందంతో యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తున్నారు. తన తోటివారంతా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతో ఆమె కూడా రంగంలోకి దిగింది. స్టోరీ, క్యారెక్టర్ నచ్చితే తల్లి పాత్రలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. హైదర్‌లో 36 ఏళ్ల షాహిద్ కపూర్‌కి తల్లిగా నటించడమే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు ఇలాంటి ఆఫరే టాలీవుడ్‌లో అందుకుంది టబు. అఖిల్, మేఘా ఆకాష్ జంటగా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రం నిర్మిస్తున్నారు. దీనిలో అఖిల్‌కు తల్లిగా టబుని తీసుకున్నారట. తొలుత ఈ పాత్ర కోసం చాలా మంది పేర్లు అనుకున్నప్పటికి ..ముందు నుంచి అక్కినేని ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉండటంతో టబుకి అదృష్టం వరించింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



