అక్కినేని అఖిల్ లవర్ ఎవరో తెలుసా..?
on Apr 21, 2016

అక్కినేని అందగాడు అఖిల్ కు ఒక్క సినిమాతోనే లేడీస్ లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. మరి అఖిల్ కు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్. లేకేం..నిక్షేపంగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు ఖలీసీ. తన జీవితానికి ఖలీసీయే రాణి అట. ఇంతకీ ఆ క్వీన్ ఎవరో ఫోటోలో మీకు అర్ధమయ్యే ఉంటుంది. బ్లూక్రాస్ లాంటి స్వచ్చంద సంస్థను స్థాపించి యానిమల్ ప్రొటెక్షన్ కోసం పాటు పడుతున్నారు అమల. మరి ఆమె తనయుడికి ఆ ప్రేమ రాకుండా ఎలా ఉంటుంది. అందుకే ఖలిసీ అనే ఈ కుక్కను ప్రాణంగా చూసుకుంటున్నాడు అఖిల్. మంచు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే ఈ కుక్క హస్కీ బ్రీడ్ కు సంబంధించింది. తనకోసం ప్రత్యేకంగా ఫారిన్ నుంచి అఖిల్ తెప్పించుకున్నాడు. ఖలిసీ పై తన ప్రేమను సెల్ఫీ తీసి ట్విట్టర్లో షేర్ చేసి చూపించాడు అక్కినేని వారబ్బాయి. అదండీ విషయం..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



