అఖండ 2 నిర్మాతలకి కొత్త చిక్కులు
on Dec 5, 2025
.webp)
ఏంటి ఆ సమస్య
దీనికి పరిష్కారం ఎలా!
ఫ్యాన్స్ పడిగాపులు
కోట్లాది మంది అభిమానులని నిరాశకి గురి చేస్తు అఖండ 2(Akhanda 2)రిలీజ్ కానీ విషయం తెలిసిందే. ఇప్పటికి చాలా మంది అభిమానులు థియేటర్స్ దగ్గర పడి గాపులు కాస్తున్నారంటే బాలయ్య పై వాళ్ళకి ఉన్న అభిమానాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎగ్జిబిటర్స్ రిలీజ్ కి ముందు తమ థియేటర్స్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు డిస్టిబ్యూటర్స్ కూడా అఖండ 2 తమని లాభాల పట్టించడం ఖాయమనే నమ్మకాన్ని పెట్టుకున్నారు.
ఇప్పుడు వారి గురించి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన నట్టికుమార్ మాట్లాడుతుఅఖండ 2 రిలీజ్ జరగకపోవడం పూర్తిగా అనుకోని విషయం. అభిమానులు. ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. నేను ఒక ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్‌గా చేస్తున్న వినతి మాత్రమే కాదు. పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నాతో మాట్లాడి తమ అభిప్రాయాలు, ఆందోళనలు పంచుకోవడంతో, వారి తరఫున ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా వాయిదా పడటంతో పాటు, కొత్త రిలీజ్ తేదీ కూడా ఖరారు కాకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరిగాయి. వారు ఇచ్చిన మొత్తం 100 కోట్లకు పైగానే ఉండడం, ఆ మొత్తాలపై భారీ వడ్డీలు చెల్లించాల్సి రావడం వంటి కారణాల వల్ల వారికి తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఏర్పడింది. వారి పరిస్థితి, వారి బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి.
also read: akhanda 2: జై బాలయ్య అంటు థమన్ ట్వీట్ వైరల్
ఈ పరిస్థితుల్లో అమౌంట్ రిఫండ్ చేస్తే వారికి ఒక పెద్ద ఉపశమనం లభిస్తుంది. అందువల్ల, దయచేసి ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లకి వారు చెల్లించిన మొత్తాన్ని రేపటిలోగా రీఫండ్ చేయాలని మనవి చేస్తున్నాను. ఇలా చేయడం ద్వారా మన తెలుగు సినీ పరిశ్రమ ఒకటిగా నిలబడి, ఒకరికి ఒకరం తోడుగా ఉంటామనే బలమైన సందేశాన్ని అందిస్తుంది. ఇది మన సంపూర్ణ ఐక్యతని చూపించే సందర్భం కూడా అవుతుందని నట్టికుమార్ తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



