అఖండ 2 ఫస్ట్ లుక్ చూస్తారా!
on Jan 31, 2025
'డాకు మహారాజ్'(Daku Maharaj)తో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)తన కెరీర్ లో మరోసారి హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.100 కోట్ల క్లబ్ లో కూడా చేరి సంక్రాంతి హీరో అనే టాగ్ లైన్ కి తిరుగులేదని మరోసారి చాటి చెప్పాడు.ఇక డాకు మహారాజ్ తర్వాత బాలయ్య 'అఖండ' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2(Akhnada 2)తో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ మూవీ కోసం బాలయ్య అభిమానులతో పాటు,ప్రేక్షకులు ఇప్పట్నుంచే ఎదురుచూస్తూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ లుక్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.మొదటి భాగంలో బాలయ్య కనిపించిన దానికంటే తలదన్నేలా బోయపాటి శ్రీను(Boyapati Srinu)మరింత పవర్ఫుల్ షేడ్ ని బాలయ్య కోసం సిద్ధం చేశారనే వార్తలు వస్తున్నాయి.డెఫినెట్ గా ఆ కొత్త లుక్ అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని కూడా తెలుస్తుంది.అఖండ మొదటి భాగంలో బాలయ్య రైతుగా, అఘోర గా రెండు వేరు వేరు లుక్స్ లో ఎంతో వైవిధ్యాన్ని కనపర్చిన విషయం తెలిసిందే.ఆ రెండు క్యారెక్టర్లు నేటికీ అభిమానులు,ప్రేక్షకుల కళ్ళ ముందు మెదులాడుతూనే ఉన్నాయి.అంతలా బాలయ్య ఆ రెండు క్యారెక్టర్స్ ద్వారా మెస్మరైజ్ చేసాడు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న అఖండ 2 గెటప్ కి సంబంధించిన వార్త సినీ ట్రేడ్ సర్కిల్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు.
రీసెంట్ గా బోయపాటి అఖండ 2 షూటింగ్ కి సంబంధించిన లొకేషన్ల కోసం కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణానది తీరప్రాంతాన్నిసందర్శించడం జరిగింది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి కూడా వెళ్ళబోతున్నఈ మూవీని 14 రీల్స్(14 reels)పతాకంపై ఆచంట రామ్, గోపి లు నిర్మిస్తున్నారు.బాలయ్య,బోయపాటి, కాంబోలో ఇప్పటికే సింహ,లెజండ్, అఖండ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉండటంతో ఇప్పుడు అఖండ పార్ట్ 2 ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్వని కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా చేస్తుండగా థమన్(Thaman)సంగీతాన్ని అందిస్తున్నాడు.విజయదశమి కానుకగా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవల్లో అఖండ 2 విడుదల కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
