హీరో అజిత్ కి యాక్సిడెంట్.. కారు తుక్కు తుక్కు..!
on Jan 7, 2025
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ పెను ప్రమాదం తప్పింది. దుబాయ్లో అజిత్ రేసింగ్ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. (Ajith Kumar)
అజిత్ ప్రొఫెషనల్ రేసర్ అనే విషయం తెలిసిందే. పలు రేసింగ్ ఛాంపియన్ షిప్స్ లో ఆయన పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే జనవరి 11, 12 తేదీల్లో జరగనున్న 24H Dubai 2025 కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ రేసింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఈరోజు మధ్యాహ్నం అజిత్ నడుపుతున్న రేసింగ్ కారు ప్రమాదానికి గురైంది. కారు వేగంగా వెళ్లి సైడ్ వాల్ కి ఢీ కొట్టింది. గోడను ఢీ కొనడంతో ట్రాక్ పై కారు గిర్రున తిరిగింది. అయితే ఈ ప్రమాదంలో అజిత్ గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.