అరుదైన వ్యాధి బారిన పడిన అజిత్.. నాలుగు గంటలే నిద్ర
on Oct 1, 2025

థల అజిత్ కుమార్(Ajith Kumar)ఏప్రిల్ 10 న 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly)తో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టి, తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. సుమారు 250 కోట్ల రూపాయలతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద 320 కోట్ల వరకు వసూలు చేసి, సిల్వర్ స్క్రీన్ వద్ద అజిత్ కి ఉన్న స్టార్ డమ్ ని మరోసారి చాటి చెప్పింది. ప్రస్తుతం 'అజిత్' ఎలాంటి కొత్త చిత్రానికి కమిట్ అవ్వలేదు. దీంతో అజిత్ కొత్త చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రేసర్ గా కూడా తన సత్తా చాటుతు పలు పథకాల్ని గెలుచుకుంటున్నాడు. ఈ క్రమంలో గాయాలు పాలయైనా, తాను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు.
రీసెంట్ గా అజిత్ ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతు నాకు చాలా సంవత్సరాల నుంచి 'స్లీపింగ్ డిజార్డర్'(Sleeping disorder)ఉంది. విరామ సమయంలో, ప్రయాణ సమయంలో నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటాను. దాంతో అతి కష్టం మీద రోజుకి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతాను. ఈ విషయంలో ఎంత ప్రయత్నించినప్పటికీ కుదరడం లేదు.
రేసర్ గా నా ప్రయాణంలో జరిగే ప్రమాదాల గురించి వస్తున్న వార్తలు చదువుతాను. ఈ రంగంలో ప్రమాదాలు జరగడం సహజం. రేసింగ్ లో పాల్గొనే ఎవర్ని అడిగినా ఈ విషయాన్నే చెప్తారు. డ్రైవర్ల భద్రతకి ప్రాధాన్యమిస్తు, రేసింగ్ కారులని ప్రత్యేకంగా తయారు చేస్తారు. అందుకే ప్రమాదాలు జరిగిన తీవ్ర స్థాయిలో జరగవు. ప్రాణాలు పోయే ప్రమాదం చాలా తక్కువ అని అజిత్ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



