నా భార్య అభిమానులకి కృతజ్నతలు..పద్మభూషణ్ అజిత్ ఏం చెప్పాడు!
on Apr 30, 2025

తమిళ చిత్ర సీమలో స్టార్ హీరో 'అజిత్'(Ajith Kumar)కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ముప్పై మూడు సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్ పై తన హవా కొనసాగిస్తు ఎన్నో వైవిద్యమైన క్యారెక్టర్స్ ని పోషించడమే కాకుండా, లక్షలాది మంది అభిమానులని తన నటనతో అలరిస్టు వస్తున్నాడు. ఈ కారణంతోనే కేంద్ర ప్రభుత్వం(Central Government)అజిత్ ని పద్మభూషణ్(Padmabhushan)తో గౌరవించింది.
పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా రీసెంట్ గా అజిత్ ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన మాట్లాడుతు ఇంతటి విజయాన్ని సాధించినందుకు ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపించినా ఈ అవార్డు నాకు ఎంతగానో ప్రేరణగా నిలుస్తుంది. నేను ఈ స్థాయిలో ఉండటానికి నా భార్య షాలిని(Shalini)నే కారణం. నా ప్రతి పనిలో తోడుగా ఉంటు నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎప్పటికప్పుడు నన్ను ఉత్సాహంగా ఉండేలా చేస్తు, ఏమైనా తప్పు నిర్ణయాలు తీసుకున్నా వాటిని సరిదిద్ది అండగా నిలుస్తుంది. నా లైఫ్ లో కొనసాగిన సక్సెస్ క్రెడిట్ అంతా ఆమెకే ఇస్తాను. ఎంతో ప్రజాదరణ పొందిన నటి అయినప్పటికీ నా కోసం నటనకి దూరమయ్యింది. ఆమెకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అజిత్ తన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
షాలిని విషయానికి వస్తే చిరంజీవి, శ్రీదేవి(Sridevi)కాంబోలో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' మూవీలో చిరంజీవి(Chiranjeevi)చేరదీసే అనాధ పిల్లల్లో ఒకటిగా నటించి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది. బాలనటిగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ చిత్ర సీమలో సుమారు 60 కి పైగా చిత్రాల్లో కనపడి ప్రేక్షకులని మెప్పించింది. 1997 లో అనియత్తుప్రావు' అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత 'అమర్ కాలం','అలైపయుతె', 'ప్రియాదువరం వెండుమ్' వంటి తమిళ చిత్రాల్లో నటించింది. వీటిల్లో అమర్ కాలంలో 'అజిత్ 'తో జతకట్టగా 'అలై పయుతె' లో మాధవన్ తో జోడి కట్టింది. ఈ మూవీ తెలుగులో'సఖి' గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. 2000 వ సంవత్సరంలో అజిత్, షాలిని వివాహం జరగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



