తినడానికి డబ్బులు లేని సందర్భాలు ఉన్నాయి
on Aug 23, 2019
కాలిఫోర్నియా నుంచి వచ్చినా కానీ, కృష్ణానగర్ కష్టాలు నాకూ తప్పలేదు. నాన్న డాక్టర్ చదివినా కానీ, కాలిఫోర్నియా వారు యాక్సెప్ట్ చేయకపోవడంతో అమ్మనాన్న ఒక రెస్టారెంట్‌లో పని చేశారు. ఇక దాంతో బట్టలు కొనడానికే కాదు, కనీసం రెస్టారంట్ కి వెళ్లి తినడానికి డబ్బులు లేని పరిస్థితి అంటూ ఎన్నడూ లేని విధంగా ఎంతో ఆవేదనతో మాట్లాడారు అడివి శేషు. అడివి శేష్ అనగానే ...ఆయన వేషభాష లు చూసి రిచ్ కిడ్ లే అనుకుంటాం. కానీ, తను కూడా రూవమ్ రెంట్ కట్టలేని సందర్భా లు ఎదుర్కొన్నాడట. రెస్టారెంట్‌కి వెళ్లి తినడానికి డబ్బులేని పరిస్థితు అనుభవించాడట. ఈ విషయాన్ని స్వయంగా తనే ఈ రోజు జరిగిన ‘ఎవరు’ సినిమా థ్యాంక్స్ మీట్‌లో చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ...‘‘అందరూ విదేశాల్లో ఫెరారీ కార్లలో తిరుగుతూ , ఏదో సరదాగా వచ్చి సినిమల్లో క్యారక్టర్స్ చేసి వెళ్తుంటాడు శేషు అనుకునేవాళ్లు. నా వేషభాష ను చూసి చాలా రిచ్ కిడ్ అనుకునే వారు. నేను కూడా వారిని అలాగే అనుకోనిచ్చాను తప్ప ...ఏ రోజు నా పరిస్థితి ఏంటనేది ఎవరికీ చెప్పలేదు. ఇక విలన్ పాత్రలు చేస్తోన్న తరుణంలో హీరోగా పాటలు , ఫైట్స్ పెట్టి సినిమా చేయి అని కొందరు చెప్పడంతో ‘కిస్’ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు మూడు కోట్లు అప్పు చేశాను. కనీసం పోస్టర్స్ అంటించిన మైదా పిండి ఖర్చు కూడా ఆ సినిమాకు రాలేదు. ఇక ఆ సినిమా కోసం అప్పు ఇచ్చిన వాళ్ళు పోలీస్ కేసు పెట్టించారు. పోలీసుతో బెదిరించారు. ఢిల్లీ లో పోలీస్ స్టేషన్ లో కూడా గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఇక మళ్లీ అలాంటి సిట్యుయేషన్ ఎదురు కాకూడదన్న కసితో క్షణం సినిమా ప్రారంభించాను. నన్ను పీవీపీ గారు నమ్మారు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో గూఢచారి చేశాను. ఆ సినిమా కూడా సక్సెస్ ఇప్పుడు ‘ఎవరు’ చిత్రం కూడా మంచి సక్సెస్ సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్ లాభా బాటలో ఉన్నారు. ఇక నేను కష్టాల్లో ఉన్న సమయంలో నాకు ఎంతో సపోర్ట్ చేసిన వ్యక్తి అబ్బూరి రవిగారు. ఇక చాలా మంది నిర్మాత లు ఫోన్స్ చేసి సినిమా చేద్దాం అంటున్నారు. నేను కోరుకుంది కూడా అదే . నా మీద నమ్మకం. ఆ నమ్మకంతో అందరిలో నా పై కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక మంచి సినిమా హీరోగా నన్ను గుర్తిస్తే చ లు తప్ప పూలాభిషేకా లు , కటౌట్స్ నాకు వద్దంటూ చెప్పుకొచ్చారు అడివి శేష్.