Home

»

Latest News

ఆదర్శ కుటుంబం పరిస్థితి ఏంటి: హిట్ కొడుతున్నారా..అది జరిగితే మాత్రం!

Oct 28, 2026 5:41PM


నవ్విన నాప చేనే పండుతుందనే నానుడి ప్రస్తుత ఏఐ యుగంలో  ఆదర్శ కుటుంబం ద్వారా తన ఉనికిని చాలా బలంగా చాటేలా ఉంది. నిజానికి కొన్ని రోజుల ముందు వరకు ఆదర్శ కుటుంబంపై అంచనాలు లేవు. మేకర్స్ కి కూడా ఈ విషయం తెలియంది కాదు. కానీ ప్రమోషన్స్ తో అంచనాలకి మించిన అంచనాలని పెంచుకుంది. దీంతో సినిమా ఫలితంపై అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి సినిమా ఏం చెప్పాలనుకుంటుందో ఒకసారి చూద్దాం.

 
ముఖ్యంగా నేటి తరం కుటుంబాల్లో మాయమవుతున్న అనుబంధాలు, మనుషుల మధ్య పెరిగిన దూరాలు, ఆత్మీయతల విలువని గుర్తుచేసే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందనే వార్త ఫ్యామిలీ ఆడియన్స్‌ని  విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. మొదటి రోజే యూట్యూబ్‌లో 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలవడం ఈ కాంబోకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. గతంలో వెంకటేష్ నటించిన కుటుంబ కథా చిత్రాలకి త్రివిక్రమ్ అందించిన మాటల విందుకి ట్రేడ్ వర్గాల్లో భారీ స్పందన ఉండేది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా చేస్తున్నారు. దీంతో మరో సారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని, హిట్ పక్కా అనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.   ప్రీ-రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే దాదాపు  80 కోట్ల మేర జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నాన్-థియేట్రికల్ రైట్స్, డిజిటల్ ఓటీటీ హక్కులు ఏకంగా  50 కోట్లకు అమ్ముడుపోవడం ఈ ప్రాజెక్ట్ విలువని  చాటిచెబుతోంది.


ఇది కూడా చదవండి: అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే: హీరో ఎవరంటే!

 

 

సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే కుటుంబ ప్రేక్షకుల నుంచి ఏకంగా 95% సానుకూల రేటింగ్ మరియు సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా థియేటర్లకు కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఈ సినిమాతో మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు.  వెంకటేష్, శ్రీనిధి శెట్టి నటన, త్రివిక్రమ్ రాసిన పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి 30 న అసలు విషయం తెలిసిపోనుంది.

 

[Adarsha Kutumbam censor Report, Adarsha Kutumbam Public Talk, Venkatesh Trivikram Movie, Adarsha Kutumbam Update, Venkatesh New Telugu Movie, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com