'డేటింగ్‌కి రెడీనా?' అంటున్న అదా శర్మ!
on Nov 12, 2019
'మీరు డేటింగ్‌కు రెడీనా? అయితే నన్ను కలుసుకోండి' అంటోంది 'హార్ట్ ఎటాక్' హీరోయిన్ అదా శర్మ. అవును, నిజమే. ఎందుకంటే.. ఆమె 'మ్యాచ్‌మేకర్'గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉంది. మీకు డేటింగ్ పార్ట్‌నర్‌ను చూసే బాధ్యత ఆమె తీసుకోబోతోంది. ఫేస్‌బుక్‌కు చెందిన ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ డేటింగ్ షో.. 'ద బెస్ట్ ఆఫ్ మి'కు ఆమె హోస్ట్‌గా.. అంటే, మ్యాచ్‌మేకర్‌గా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మొటమొదటి పీజీ-13 డేటింగ్ షో కావడం విశేషం. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'హార్ట్ ఎటాక్' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అదా తన అందచందాలు, అభినయంతో ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గరం', 'క్షణం', 'కల్కి' సినిమాలతో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్‌లోనూ రాణించి, దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది.
'ద బెస్ట్ ఆఫ్ మి' షోలో పాల్గొనే వాళ్లకు, పర్ఫెక్ట్ డేటింగ్ మేట్‌ను కనిపెట్టడంలో మ్యాచ్‌మేకర్‌గా తనవంతు సాయం చేస్తుంది అదా. ఈ షోలో అన్ని వయసుల వాళ్లూ తమ డేటింగ్ భాగస్వామి కోసం అన్వేషించడాన్ని మనం చూడబోతున్నాం. ప్రస్తుతం ఈ షో ఫస్ట్ సీజన్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ షో కాన్సెప్టును ఒక ఇంటర్నేషనల్ టీం డెవలప్ చేసింది. ఇండియాలో ఈ షోను నిర్వహించగల యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్ట్రెస్ కోసం ఆ టీం చేసిన అన్వేషణ అదా శర్మ దగ్గర ఆగింది. ఈ క్రమంలో ఆ టీం చాలామంది సినీ తారల్ని పరిశీలించింది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయి ఉండటం, ఫ్యాన్స్‌కు సమయస్ఫూర్తితో ఆమె ఇచ్చే సమాధానాలు గమనించిన ఆ టీం.. తాము వెతుకుతున్న సెలబ్రిటీ అదా శర్మేనని డిసైడ్ చేసుకుంది. కారణం.. 'ద బెస్ట్ ఆఫ్ మి' షోలో ఫన్ ఎలిమెంట్ కూడా ఉండటం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉన్న అదా దాన్ని బాగా పండించగలదని నమ్మింది ఆ టీం.
ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం రావడంతో ఎగ్జయిట్ అయిన అదా శర్మ, "ఈ మ్యాచ్‌మేకింగ్ చేయడాన్ని పవర్‌ఫుల్‌గా ఫీలవుతున్నా.. దాంతో పాటు గొప్ప రెస్పాన్సిబిలిటీని కూడా. సరైన జంటల్ని కలపడానికి నా శాయశక్తులా కృషి చేస్తున్నా" అని చెప్పింది. ఇదివరకు ఆమె 'ది హాలిడే' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అది వ్యూయర్స్‌ను బాగా ఆకట్టుకుంది. దానికి పనిచేసిన అనుభవం ఈ షోకు పనికి వచ్చిందనేది ఆమె ఫీలింగ్. ఈ షోను అన్ని వయసుల వాళ్లూ, ఆడా-మగా, అన్ని భాషలవాళ్లూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆమె నమ్మకం. "ప్రేమను అన్వేషించడం నా పని. లవ్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి 'ద బెస్ట్ ఆఫ్ మి' షోను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు" అని చెప్తోంది అదా.
తెలుగులో రాజశేఖర్ జోడీగా ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ అయిన 'కల్కి'లో కనిపించిన ఆమె, పోయిన వారమే రిలీజైన నీల్ నితిన్ ముఖేష్ సొంత సినిమా 'బైపాస్ రోడ్'లో అతని సరసన నటించింది. రాధికా నాయర్ పాత్రలో ఆమె ప్రదర్శించిన నటన ప్రేక్షకుల్ని అలరించింది. అలాగే ఈ నెలాఖరులో ఇన్‌స్పెక్టర్ భావనారెడ్డిగా మరోసారి 'కమాండో 3'లో కనిపించబోతోంది. ఇందులో బాడీ బిల్డర్ విద్యుత్ జమ్వాల్ హీరో. రెండున్నరేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్టయిన 'కమాండో 2'లోనూ ఆమె అదే పాత్రలో రాణించడంతో, సీక్వెల్‌లోనూ ఆ కేరెక్టర్ ఆమెనే వరించింది.
ఫేస్‌బుక్ వంటి టాప్ సోషల్ మీడియా సంస్థతో కలిసి పనిచేసే అవకాశం రావడం, పైగా డేటింగ్ కాన్సెప్టుతో ఇండియాలో ప్రసారం కాబోతున్న మొదటి షో కావడంతో, 'ద బెస్ట్ ఆఫ్ మి'తో అదా శర్మ పాపులారిటీ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ షోలో మ్యాచ్‌మేకర్‌గా జంటల్ని ఎలా కలుపుతుందో చూడాలని ఆమె ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Also Read