రామ్ గోపాల్ వర్మని నన్ను ఎవరు మార్చలేరు.. ప్రియా నాయుడు చెప్పేది నిజమే
on Jul 4, 2024
రామ్ చరణ్ (ram charan)హీరోగా వచ్చిన ధ్రువ, నితిన్ శ్రీనివాస కళ్యాణం, ఆది సాయి కుమార్ చుట్టాలబ్బాయి సినిమాల్లో మెరిసిన భామ ప్రియా నాయుడు(priya naidu)2019 లో వచ్చిన వేర్ ఈజ్ వెంకటేశం అనే మూవీ అయితే తనకి మంచి పేరు తీసుకొచ్చింది. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలని వెల్లడి చేసింది. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి
ఇండస్ట్రీ లో కమిట్ మెంట్ ఉంటేనే అవకాశాలు వస్తాయి. నేను అలా చెయ్యకపోవడం వల్లనే కెరీర్ లో ఇంకా ఎదగలేకపోయాను. మన తెలుగు అమ్మాయిలు గ్లామర్ గా చెయ్యాలంటే కొంచం ఎక్కువగా సిగ్గు పడతారు. అదే వేరే భాషకి చెందిన నార్త్, కన్నడ అమ్మాయిలు అయితే సిగ్గు పడరు. సిగ్గు పడటం అటుంచి ఏ విధంగానైనా నటించడానికి రెడీ అంటారు. కమిట్ మెంట్ కి కూడా ఒకే అంటారు. అందుకే వాళ్లకి అవకాశాలు వస్తాయి అని చెప్పుకొచ్చింది.
అలాగే తన పెళ్లి గురించి కూడా ప్రస్తావనకి వచ్చింది. ఆ విషయంపై మాట్లాడుతు నేను లైఫ్ లో పెళ్లి అనేది చేసుకోను. ఈ విషయంలో నేను ఎప్పుడో ఫెడప్ అయిపోయాను. సో ఇక ఆ నిర్ణయంలో మార్పు ఉండదు. ఎవరు ఎన్ని చెప్పినా రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)గారి లైఫ్ స్టైల్ లో మార్పు ఉండదు కదా.. ఒక దానికి స్ట్రాంగ్ గా ఫిక్స్ ఐతే దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఆ దేవుడు కూడా మార్చలేడని చెప్పుకొచ్చింది.
Also Read