ఎప్పటి నుండో అనుకుంటున్న ఇంద్రజ కల నెరవేరిందంట!
on Jun 10, 2023
ఇంద్రజ ఒక్కప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇంద్రజ తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి దూసుకుపోతుంది. ఇంద్రజ చాలా మూవీస్ లో సపోర్ట్ రోల్ కూడా చేసి ఆకట్టుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం స్టార్ కామెడీ షో అయిన జబర్దస్త్ కి జడ్జ్ గా చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది.
జబర్దస్త్ షో లో 'దసరా' మూవీలోని వెన్నెల చేసిన డ్యాన్స్ ని రిక్రియేట్ చేసినట్టుగా చెలరేగి చేసిన ఇంద్రజ.. మోస్ట్ వైరల్ గా వీడియో లిస్ట్ లో చేరింది. అంతేకాదు జబర్దస్త్ షోలో ఈ మధ్య ఎంట్రీ పాటకు డ్యాన్స్ కూడా చేస్తోంది. హోమ్లీ గా ఉంటూనే తనలో మరో కోణం ఉందంటూ మాస్ డ్యాన్స్ చేసి నిరూపించిన ఇంద్రజ.. బయట రెగ్యులర్ గా కొత్త ప్రదేశాలకు వెళ్తుంటుంది. అయితే కొంతకాలం క్రితం హైదరాబాద్ లోని ఒక టెంపుల్ కి వెళ్ళిన ఇంద్రజ.. అందరితో కలిసిపోయి ఏ సెక్యూరిటీ లేకుండా చాలా సాధారణ వ్యక్తిగా తిరుగుతూ వీడీయో చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా అది వైరల్ గా మారిన విషయం తెలిసిందే. జబర్దస్త్ లో తన జడ్డ్ మెంట్ తో టీం లీడర్స్ తో పాటు కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేస్తూ అందరికి ఒక అమ్మలాగా ఉంటూ వస్తోన్న ఇంద్రజ.. బయట కూడా అలానే ఉంటుందని అందరూ చెప్పుకుంటారు.
ఇంద్రజ తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే తన అభిమానులు కొన్ని ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి వీడియోస్ ఎడిట్ చేయగా.. తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా ఇంద్రజ మైసూర్ ప్యాలెస్ చూడటానికి వెళ్ళింది. తనెప్పుడూ ఆ ప్యాలెస్ చూడలేదంట. తనకి మైసూర్ ప్యాలెస్ చూడాలని ఒక డ్రీమ్ అంట. తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసింది ఇంద్రజ. "ఫైనల్లీ ఈ రోజు చూసాను. ఎప్పటి నుండో అనుకుంటున్న నా కల నెరవేరింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది" అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది ఇంద్రజ. కాగా ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
