వీడియో తీస్తున్న కొడుకు చెంప పగలకొట్టిన సీనియర్ నటి!
on Oct 28, 2021
ఆన్‌స్క్రీన్ పైనే కాదు, ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేక్షకుల్ని నవ్వించడంలో బాలీవుడ్ సీనియర్ నటి అర్చనా పూరన్ సింగ్ నేర్పరి. హీరోయిన్ నుంచి వ్యాంప్ ఆర్టిస్ట్‌గా, ఐటమ్ గాళ్‌గా కూడా రాణించిన అర్చన, ప్రస్తుతం దేశంలోనే టాప్ కామెడీ టీవీ షో 'ద కపిల్‌శర్మ షో'లో పర్మనెంట్ గెస్ట్‌గా నవ్వులు పంచుతున్నారు. తాజాగా ఆమె చిన్నకొడుకు ఆయుష్మాన్ సేథి ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో అర్చన అద్దం ముందు నిల్చొని తన జుట్టును ట్రిమ్మింగ్ చేసుకుంటోంది. దాన్ని ఆయుష్మాన్ వీడియో తీస్తుండటంతో కోపంతో అతడి చెంప పగలగొట్టింది అర్చన.
తన జుట్టును ఎక్కువగా కత్తిరించుకున్నాననీ, ఇంకా కట్ చేస్తే, గుండు అయిపోతుందనీ ఆ వీడియోలో ఆమె చెప్పడం కనిపించింది. దీనికి రెస్పాండ్ అయిన ఆయుష్మాన్.. అందుకే కదా, డ్రెస్సింగ్ టేబుల్‌పై డస్ట్‌బిన్‌ను పెట్టిందని కామెంట్ చేశాడు. అప్పుడు కొడుకు తనను వీడియో తీస్తున్నాడని గ్రహించిన అర్చన, అతడి ముఖంపై గట్టిగా ఒక్కటిచ్చింది. వీడియోలో ఆమె కొట్టిన దృశ్యం కనిపించలేదు కానీ, చెంపదెబ్బ గట్టిగా కొట్టినట్లు పెద్ద శబ్దమే వచ్చింది. ఆ వీడియోను షేర్ చేసిన ఆయుష్మాన్ ఆ పోస్ట్‌కు "మా కా థప్పడ్" (అమ్మ చెంపదెబ్బ) అనే కాప్షన్ పెట్టాడు. "మీ అమ్మను ఇరిటేట్ చేయడం కంటే ఫన్ వేరే ఏముంటుంది?" అని కూడా రాసుకొచ్చాడు.
కోపంతో ఊగిపోతూ, కొడుకును అర్చన అలా చెంపదెబ్బ కొట్టడానికి కారణం.. ఆమె మేకప్ లేకుండా ఉండటమో, ట్రాక్ పాంట్స్, ఫ్లోరల్ టాప్ డ్రస్‌తో క్యాజువల్ లుక్‌లో ఉండటమో కారణం కావచ్చని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.