హత్య కేసులో సూపర్ స్టార్ అరెస్ట్
on Jun 11, 2024
దర్శన్(darshan)కన్నడ చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరో. యోధ. ప్రిన్స్, శాస్త్రి ,ధ్రువ, బాస్ ఇంద్ర, జగ్గు దాదా, సారధి లాంటి మొదలైన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన్ని ఒక మర్డర్ కేసు లో పోలీసులు అరెస్ట్ చెయ్యడం సంచలనం సృష్టిస్తుంది.
దర్శన్ ని ఈ రోజు ఉదయం హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసారు. పవిత్ర గౌడ అనే నటి దర్శన్ సన్నిహితంగా ఉంటారు. ఆమెకి ఆల్రెడీ వేరే వ్యక్తి తో వివాహం అయ్యింది కూడా. ఇక పవిత్ర గౌడకు రేణుక స్వామి అనే వ్యక్తి నుంచి అభ్యంతకర మెసేజ్ లు వచ్చేవి.కొన్ని సందర్భాల్లో బెదిరించే వాడు కూడా. దీంతో ఆ విషయాన్ని దర్శన్ కు చెప్పడంతో కొంత మందికి డబ్బులు ఇచ్చి దర్శన్ నే రేణుక స్వామిని మర్డర్ చేయించినట్లు తెలుస్తుంది.
ఈ మర్డర్ కేసులో పోలీసులు కొంత మందిని పట్టుకున్నారు. దర్శన్ చంపమంటేనే చంపామని వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది .ఈ కేసుకి సంబంధించి మొత్తం 9 మందిని అరెస్ట్ చేసారని సమాచారం. అయితే ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై దర్శన్ కానీ, అతని ఫ్యామిలీ కానీ ఇంకా ఎవరూ స్పందించలేదు. దర్శన్ ను మైసూరు ఫామ్ హౌస్ లో ఉండగా అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
