"భాగమతి"తో వైరం ధనుష్..!
on Jun 5, 2016

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి అనుకున్న స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఆఫర్లు రాక కోలీవుడ్ బాట పట్టి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడంతో పాటు అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తూ తెలుగువారికి టచ్‌లో ఉన్నాడు. అయితే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో టాలీవుడ్‌లో కొందరు దర్శక నిర్మాతలు ఆదిని ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడి ఓరియెంటెడ్ మూవీ భాగమతిలో అనుష్కకు జంటగా ఆదిని అనుకున్నారు. దర్శకుడు అశోక్ చెప్పిన కథ విన్న ఆది వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్న టాక్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఈ నెల మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



