యమలీల 2 రివ్యూ
on Nov 28, 2014
యమలీల.... చిన్న సినిమాల్లో ఓ ట్రెండ్ సృష్టించిన సినిమా.ఫాంటసీ కధలు,యముడి గాధలు అంటే పెద్ద హీరోలు,భారీ బడ్జెట్లు అనుకునే రోజుల్లో ఓ హాస్య నటుడిని హీరోగా చేసి లక్షలలో సినిమా తీసి,కోట్లు గడించిన మ్యాజిక్ మూవీ ఇది.ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందంటే ఎంతోకొంత ఆసక్తి.ఎస్వీ కృష్ణారెడ్డికి ఏళ్లుగా హిట్ లేకున్నా ఈ సీక్వెల్తో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని ప్రేక్షకులు ఆశించారు.మరి ఆ అంచనాలు,ఆశలు ఎమయ్యాయో ఈ సీక్వెల్ చెసిన మ్యాజిక్ ఎంటో చూద్దాం రండి.
క్రిష్( సతీష్) ఓ అకాంలజిస్ట్ . లుకేమియాకు మందు కనిపెట్టాలన్నది అతని లక్ష్యం, బాధ్యత కూడా. ఎందుకంటే క్రిష్ ప్రాణానికి ప్రాణం గా ప్రేమించె అతని అన్న కూతురు లుకేమియా వ్యాధి గ్రస్తురాలు.మూడు నెలలలో చనిపోతుంది ఆమెను కాపాడుకునెందుకు హిమాలయాల్లో ఉండే సంజీవిని మొక్క కోసం మానససరోవరం కు వెళతాడు. అక్కడ అప్పటికే విహారానికి యముడు,చిత్రగుప్తుడు వచ్చుంటారు. చిత్రగుప్తుడు చెసిన చిన్న పోరపాటు వల్ల భవిష్యవాణి కాస్త క్రిష్ చేతికి చిక్కుతుంది.దాన్ని తెరచి చూసిన క్రిష్ కు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది.అదెంటి క్రిష్ తన అన్న కూతురును ఏలా కాపాడుకున్నాడు.భవిష్యవాణి కోసం భూలోకం వచ్చిన యముడు,చిత్రగుప్తుడు ఏలాంటి పరిస్దితుల్లో ఇరుక్కున్నారనేది తెరమీద చూడాల్సిందే..
సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ తీయటం సులభం కాదు. ప్రేక్షకులు ఎన్నో అంచనాలతో వస్తారు.అందునా మన తెలుగులో సీక్వెల్ సినిమాలు హిట్ అయిన దాఖలాలు లేవు.ఈ సెంటిమెంట్ ను పట్టించుకోకుండా 20ఏళ్ల క్రితం హిట్ అయిన యమలీల కు కృష్ణారెడ్డి కోనసాగింపు చెసెందుకు ధైర్యం చేశారు. ఆ యమలీల తరహాలోనె కాస్త కామెడీ,సెటింమెంట్ లకు యమ ఫార్ములాను జోడించి వదిలాడు. తోలి భాగం మదర్ సెటిమెంట్ తో ఆకట్టుకుంటే. ఈ సినిమాను మాత్రం చెల్డ్ సెంటిమెంట్ తో సరిపెట్టాడు.యమలీల పేరు చెప్పి ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించాలనుకున్న దర్శకుడు కృష్ణారెడ్డి స్ర్కిప్ట్ విషయంలో ఏమాత్రం శ్రధ్ద పెట్టలేదన్న విషయం క్లారిటీ గా అవగతమవుతుంది. పైగా ఈ సినిమాతో ఓ కొత్త హీరో తెరమీదకొచ్చాడు. అతనికా సినిమా కొత్త, నటించటం కూడా కొత్తే. అన్ని విషయాల్లోను అన్నప్రశాన దశలోనె ఉన్నాడు. ఈ విషయం అతను తెరపై కనిపించిన ప్రతిసారి అర్దం అవుతూనె ఉంటుంది. యమలీల హిట్ అవ్వటానికి ప్రదాన కారణం వినోదం. ప్రతి సీన్లోను నవ్వించిన సినిమా అది. కానీ ఈ సినిమాలో వినోదం ఉడికి ఊడకనట్టుగా ఉంది.యమలీల లో యముడు,చిత్రగుప్తుడు, కధానాయకుడు,పాత్రల్లో ఓ విదమైన అమాయకత్వం ఉంటుంది. అందులోంచి పుట్టిన వినోదం కాస్త కొత్తగా,ఇకాస్త విచిత్రంగా ఉండి ట్రెండ్ సెట్ చెసింది.యమలీల 2లో మాత్రం ఆ వినోదం ఆ విచిత్రం వైవిధ్యం పూర్తిగా మిస్ అయింది.భవిష్యవాణి పుస్తకం కధానాయకుడికి దొరకటం ,దాన్ని వెతుక్కోంటూ భూలోకం రావటం ఈ సన్నివేశాలన్నింటిని ఏ మాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయాడు.ఏ క్యారెక్టర్ ను పరిపూర్ణంగా మలచలేకపోయాడు.సెంటిమెంట్ పండితెనే ఇలాంటి సినిమాలు ఆడేది.కాని ఇక్కడ ఆ ముచ్చట కూడా మిస్ అయింది.ఫస్టాఫ్ 75 ని"లు సాగింది.కానీ ప్రేక్షకులకు మాత్రం ఏకమగా ఏడు గంటలు గడిచినట్టు ఉంటుంది.పాటలెక్కువయి నస ఇంకాస్త ఎక్కువయింది.ద్వీతియార్దం కూడా అదే తరహాలో నత్త నడకన ఉంది తప్ప ఏ మాత్రం మార్పు కనపడదు.కేవలం క్లైమాక్స్ వరకు నడిపించటానికి ఎవో కొన్ని సన్నివేశాలను పేర్చి సినిమాను మొత్తానికి మమ అనింపించాడు.దాంతో యమలీల కాస్త యమగోల గా తయారయింది.
సతీష్కు ఇది తొలి సినిమా. నిర్మాత కూడా తనే కావటంతో దర్శకుడు భరించాడు. కానీ ప్రేక్షకులు ఏపాపం చేశారు. కుర్రాడు చూడ్డానికి బావున్నా,ఎక్స్ ప్రషన్స్ ఇమ్మంటే వడ్డీ లేకుండా అప్పు ఇమ్మనంత మోమాట పడ్డాడు. సున్నితంగా పలకాల్సిన డైలాగ్ను కూడా గభీరంగా చెప్పాడు. హీరోయిన్ ఇంకా మైనస్. కాస్త ఉబ్బిన దిబ్బ రోట్టిలా ఉంది. నటన గురించి అస్సలడగొద్దు. ఈ సినిమాకు బిగ్ బలం మోహన్ బాబు, బ్రహ్మానందం. వారిద్దరి మధ్య కామెడీ పండిలేక పోవటం వల్ల వారి పాత్రల పై కూడా ఏలాంటి ప్రేమ కలుగదు. సదా, నిషా కొఠారి లాంటి ఐటైంలున్నా ఉపయోగం లేదు. కామెడీ గ్యాంగ్ ఉన్నా కితకితలు లేవు. మనకి మనమే చక్కిలిగింతలు పెట్టుకోవాల్సిన పరిస్థితి.
సాంకేతికంగా చెప్పకోటానికి పెద్దగా ఏమిలేదు. కాస్త సినిమాటోగ్రఫీ చూడ్డానికి బావుంది.2014లో కూడా 1994 గ్రాఫిక్సే ఉన్నాయి.కృష్ణంభజే పాటొక్కటే ఆకట్టుకుంటుంది.మాటల్లో పంచ్,పవర్ కూడా మిస్ అయ్యాయి.మొత్తానికి ఈ సీక్వెల్ సినిమాతో అయినా గాడిలో పడదామను కున్న కృష్ణారెడ్డికి ఈ సారి నిరాశే ఎదురయింది. 2014లో 1994 సినిమా చూడాలనుకుంటే యమలీల 2 చూడొచ్చు. మిగిలిన వారు యమలీల 1 టీవిలో వచ్చినప్పుడు చూస్కోవచ్చు.
రేటింగ్: 2.5/5