రాబోయే చిత్రాలతోనైనా రాజ్ తరుణ్ రాణిస్తాడా!
on Dec 3, 2021
కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలతో పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి.. `ఉయ్యాలా జంపాలా`, `సినిమా చూపిస్త మావ`, `కుమారి 21 ఎఫ్` వంటి మూడు వరుస విజయాలు అందుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే, ఆ తరువాత మాత్రం ఆ మ్యాజిక్ ని కొనసాగించలేకపోయాడు రాజ్. `ఈడో రకం ఆడో రకం`, `కిట్టు ఉన్నాడు జాగ్రత్త` ఓకే అనిపించుకున్నా.. ఆ తరువాత వచ్చిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి.
`అంధగాడు`, `రంగుల రాట్నం`, `రాజు గాడు`, `లవర్`, `ఇద్దరి లోకం ఒకటే`, `ఒరేయ్ బుజ్జిగా`, `పవర్ ప్లే`తో పాటు రీసెంట్ గా వచ్చిన `అనుభవించు రాజా` కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో రాబోయే చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నాడీ టాలెంటెడ్ యంగ్ హీరో. రాజ్ తరుణ్ తాజా చిత్రం `స్టాండప్ రాహుల్` విడుదలకు సిద్ధమవుతుండగా.. `జార్జి రెడ్డి` ఫేమ్ సందీప్ మాధవ్ తో కలిసి నటిస్తున్న `మాస్ మహారాజు` సెట్స్ పై ఉంది. మరి.. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా రాజ్ తరుణ్ కెరీర్ మళ్ళీ గాడిలోకి వచ్చినట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
