స్టార్ హీరోకి షాకిచ్చిన భార్య.. విడాకులు తప్పవా..?
on Jun 26, 2024
కొన్నేళ్లుగా సినీ సెలబ్రిటీల విడాకుల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ సెలబ్రిటీ డివోర్స్ అనౌన్స్ చేస్తారో అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఈ లిస్టులో మరో స్టార్ చేరబోతున్నట్లు తెలుస్తోంది.
తమిళ హీరో జయం రవి (Jayam Ravi) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయం రవి.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా లేదని సమాచారం. జయం రవి- ఆర్తి దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. తాజాగా జయం రవి భార్య ఆర్తి ఇన్ స్టాగ్రామ్ లో తన భర్తతో ఉన్న ఫొటోలన్నింటినీ డిలీట్ చేసింది.
విడాకులు ప్రకటించడానికి ముందు చాలామంది సినీ సెలబ్రిటీ జంటలు ఇదే చేస్తున్నారు. సోషల్ మీడియా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, ఫొటోలు డిలీట్ చేయడం.. ఆ తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించడం చేస్తున్నారు. జయం రవి- ఆర్తి జంట కూడా అదే ఫాలో అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, జయం రవి- ఆర్తి విహహం 2009 లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.