'ఆర్ఆర్ఆర్'లో ఆ హీరో సీన్స్ ఎందుకు తొలగించారు.. ఇన్నాళ్లకు బయటపడింది..!
on Nov 12, 2024
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. 2022 మార్చిలో విడుదలైన ఈ సినిమా సంచలన వసూళ్లతో గ్లోబల్ స్థాయిలో సత్తా చాటింది. ఎన్టీఆర్, చరణ్ లకు గ్లోబల్ ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమాలో మరో టాలీవుడ్ హీరో సత్యదేవ్ కూడా నటించాడు. కానీ ఆ సన్నివేశాలను సినిమా నుంచి పూర్తిగా తొలగించారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (Satyadev In RRR)
విభిన్న చిత్రాలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సత్యదేవ్. నవంబర్ 22న 'జీబ్రా' అనే ఫైనాన్సియల్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సత్యదేవ్ కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. "మీరు ఆర్ఆర్ఆర్ లో నటించారు కదా.. 15-16 నిమిషాల నిడివి ఉన్న మీ పాత్రను తొలగించడానికి కారణమేంటి" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, మొదట సత్యదేవ్ షాకయ్యాడు. "అనవసరమైన చర్చకు దారితీస్తుందని ఇప్పటిదాకా ఈ విషయాన్ని నేనెక్కడా షేర్ చేసుకోలేదు. ఆర్ఆర్ఆర్ లో నటించిన మాట నిజమే. 10 రోజులకు పైగా షూటింగ్ లో పాల్గొన్నాను. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ ట్రాక్ కథకు సరిపోకనో లేక రన్ టైమో లేదా వేరే ఏవో కారణాల వల్ల ఆ సన్నివేశాలను తొలగించారు. అలా అని నాకు బాధలేదు. ఎందుకంటే నేను ఆ పదిరోజులు ఎంతో నేర్చుకున్నాను. భవిష్యత్ లో మళ్ళీ రాజమౌళి గారి డైరెక్షన్ లో పని చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను." అని సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. (Satyadev Zebra Movie)
కాగా, 'ఆర్ఆర్ఆర్'లో 'కొమురం భీముడో' సాంగ్ తర్వాత ఎన్టీఆర్ జైల్లో ఉన్నప్పుడు కొన్ని పవర్ ఫుల్ సీన్స్ ఉంటాయని, కానీ వాటిని ఎడిటింగ్ లో తొలగించారని గతంలో కొందరు ఆర్టిస్టులు పంచుకున్నారు. దీంతో బహుశా ఆ జైలు ఎపిసోడ్ లోనే సత్యదేవ్ పాత్ర ఉండి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read