సంపూని ‘సింగం123’ చేసిన మంచు విష్ణు
on Sep 29, 2014
.jpg)
‘హృదయకాలేయం’ చిత్రంతో సంచలన విజయం సొంతం చేసుకోవడమే కాకుండా.. ప్రపంచవాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న కథానాయకుడు సంపూర్ణేష్‌బాబు. అభిమానులు ముద్దుగా ‘సంపూ’ అని పిలుచుకొనే సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా మంచు విష్ణు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. అక్షత్‌శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రిప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంపూర్ణేష్‌బాబు అభిమానులతోపాటు యావత్ సినీ అభిమానులను అలరించేలా ‘సింగం 123’ రూపొందనుంది. ‘హృదయకాలేయం’ చిత్రాన్ని మించిని కామెడీ, సెంటిమెంట్, లవ్ అండ్ ఎఫెక్షన్ ‘సింగం 123’ చిత్రంలో ఉంటాయి. ‘సింగం 123’లో సంపూ ఏ విధంగా ఉండబోతున్నాడో తెలియజేయడం కోసం నేడు ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని చిత్ర బృందం తెలిపింది.ఇకపోతే.. 24 ఫ్రేమ్స్‌ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న మరో చిత్రం ‘కరెంట్ తీగ’ అక్టోబర్ 17న విడుదల కానుంది!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



