ఇంటివాడైన మనం దర్శకుడు..
on Sep 4, 2016
అక్కినేని వంశంలోని మూడు తరాలను సింగిల్ ఫ్రేమ్‌లో చూపించిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ఓ ఇంటివాడయ్యాడు. చెన్నైలో విక్రమ్ కుమార్, శ్రీనిధిల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, స్నేహితులు ఈ వివాహనికి హాజరై నూతన వధూవరూలను ఆశీర్వదించారు. తమిళ సినీ పరిశ్రమ నుంచి సూర్య, ఏఆర్ రెహ్మాన్ తదితరులు హాజరయ్యారు. ఇటీవల సూర్యతో విక్రమ్ తెరకెక్కించిన 24 మూవీకి సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసిన శ్రీనిధితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి, పరిణయం వరకు వెళ్లింది.