ఈ లెజండ్ నిజంగానే తెలంగాణ వాడేనా
on Jan 29, 2025
స్టార్ హీరో 'విజయ్ దేవరకొండ'(Vijay Devarakonda)గత కొంత కాలం నుంచి వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.దీంతో ఈసారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలనే పట్టుదలతో ఒక వినూత్నమైన కదాంశంతో కూడిన చిత్రంలో చేస్తున్నాడు.దేవరకొండ నుంచి వస్తున్న ఈ 12 వ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ పై నాగవంశీ(Naga Vamsi)నిర్మిస్తుండగా జెర్సీ ఫేమ్ 'గౌతమ్ తిన్ననూరి'(Gowtham Tinnanuri)దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే(Cold Play)గురించి వరల్డ్ మ్యూజిక్ ని ఇష్టపడే వాళ్ళకి బాగా తెలుసు.రీసెంట్ గా కోల్డ్ ప్లే ఇండియా టూర్ లో భాగంగా అహ్మదాబాద్,ముంబై లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించింది.కొన్ని లక్షల మంది ఆయా ఈవెంట్స్ కి హాజరు కాగా పాప్ సంగీతంలో భారతీయ సంగీత ప్రియులు తన్మయత్వం చెందారని చెప్పవచ్చుఇక అహ్మదాబాద్ లో జరిగిన ఈవెంట్ తర్వాత బృందంలోని క్రిస్ మార్టిన్(Chris martins)మాట్లాడుతు మా బృందంలోని సభ్యులందరికి థాంక్స్.29 ఏళ్ళ నుంచి అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం.చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మా నలుగురం భారత్ లోనే జన్మించాం.కాబట్టి మాది ఇండియన్ బ్యాండ్ కిందకే వస్తుంది.బెర్రీ మాన్ ది స్విట్జ్జర్లాండ్ అని అనుకుంటారు.కానీ అతనిది తమిళనాడు.నేను తెలంగాణ నుంచి వచ్చానని అందరకి తెలుసు.మా నాయకుడు విల్ మేమంతా కలిసి ఉండేలా చూస్తున్నాడని చెప్పాడు .ఇప్పుడు క్రిస్ మాట్లాడిన మాటల తాలూకు వీడియో వైరల్ అవుతుండగా,విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఆ వీడియోకి రిప్లై ఇస్తు 'వెల్ కమ్ టూ క్రిస్ మార్టిన్, పొడుస్తున్న పొద్దు మీద 'కోల్డ్ ప్లే' పై ఎవరైనా మాషప్ చేస్తే బాగుంటుందంటు ట్వీట్ చేసాడు.
క్రిస్ మార్టిన్,జానీ బుక్ లాండ్,బెర్రీ మాన్,విల్ ఛాంపియన్ జట్టుగా ఏర్పడిన 'కోల్డ్ ప్లే' .1998 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇస్తు వస్తుంది.ఎన్నో ఆల్బమ్స్ సంగీత ప్రియులని ఉర్రుతలుగిస్తు వస్తున్నాయి.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)