మెగా సినిమాల్లో విజయ్ సేతుపతి పాత్రలు ఇవే!!
on Jun 12, 2019

వెరైటీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు తమిళ నటుడు విజయ్ సేతుపతి. తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న ప్రతాభావంతుడు ప్రజంట్ తెలుగులో రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు కూడా మెగా ఫ్యామిలీకి చెందినవి కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న `సైరా` సినిమాలో ఒకవైపు నటిస్తూనే మరో వైపు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతోన్న `ఉప్పెన` లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఆ రెండు సినిమాల్లో విజయ్ పాత్రలకు సంబంధించి ఇన్ని రోజులు సస్పెన్స్ ఉండేది. ఇక అప్పుడు ఆ సస్పెన్స్ కాస్త వీడింది. సైరా చిత్రంలో తమిళం లో మాట్లాడే ఓబయ్య అనే పాత్రలో కనిపించనున్నాడట. అలాగే ఉప్పెన సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా నటించనున్నాడట. ఈ రెండు సినిమాల్లో విజయ్ సేతుపతివి సినిమాకు ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలని సమాచారం అందుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



