మరో క్రేజీ మల్టీస్టారర్ లో వెంకటేష్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
on Jul 12, 2024
మల్టీస్టారర్ సినిమాలు చేయడంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ఆయన మహేష్ బాబు (Mahesh Babu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రామ్, నాగ చైతన్య, వరుణ్ తేజ్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు వెంకటేష్ మరో మల్టీస్టారర్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో వేణు ఊడుగుల (Venu Udugula) ఒకరు. 'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక రెండో సినిమా 'విరాట పర్వం' ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఆ సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇంతవరకు తన మూడవ సినిమాని ప్రకటించలేదు వేణు. మధ్యలో ధనుష్, నాగ చైతన్య వంటి హీరోల పేర్లు వినిపించాయి కానీ.. అవి ప్రచారానికే పరిమితమయ్యాయి.
ఇప్పుడు ఎట్టకేలకు వేణు ఊడుగుల నెక్స్ట్ మూవీ లాక్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది. వెంకటేష్ హీరోగా నటించనున్న ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందనుందట. అంతేకాదు.. ఇది మల్టీస్టారర్ అని, ఇందులో వెంకటేష్ తో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు నటించనున్నారని వినికిడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ ఓ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత వేణు ఊడుగుల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.