మెగా హీరోకు టైటిల్ కుదిరింది
on Aug 18, 2014
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమాకు టైటిల్ ను ఖరారు చేశారు. గత కొంతకాలంగా ఈ సినిమా పేరు గొల్లభామగా ప్రచారం జరిగినప్పటికీ ఆ టైటిల్ ఈ సినిమాకు సెట్ కాదని ‘ముకుంద’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న విడుదల చేయనున్నారు. సీతమ్మ వాకిట్లో, కొత్తబంగారు లోకం ఫేం శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఠాగూర్ మధు - నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ నటిస్తోంది. ఈ సినిమా ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ 45 లక్షలకు తీసుకున్నట్టు టాక్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
