సీనియర్ జర్నలిస్ట్ తనయుడి దర్శకత్వంలో వరుణ్ తేజ్!!
on Jul 10, 2019
ట్రేడ్ గైడ్ తో ఓ ట్రేడ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ తనయుడు కిరణ్ చాలా సినిమాలకు పలు దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసారు. ఆ అనుభవంతో మెగా హీరో వరుణ్ తేజ్ తో ఓ సినిమాను ప్లాన్ చేసాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ , డిసెంబర్ లలో షూటింగ్ ప్రారంభించుకోనున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. అయితే వరుణ్ తేజ్ సరసన హీరోగా యిన్ గా నటించేది ఎవరన్నది మాత్ర సస్పెన్స్ గా ఉంది. తమన్ కానీ, గోపీ సుందర్ గానీ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చే అవకాశాలున్నట్లు సమాచారం అందుతోంది. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట దర్శకుడు కిరణ్. ప్రజంట్ హరీష్ శంకర్ డైరక్షన్ లో వరుణ్ తేజ్ ` వాల్మీకి` చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే వరుణ్ తేజ్ , కిరణ్ దర్శకత్వంలో సినిమా చేస్తారట. దీన్ని ఓ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ నిర్మించనుందట. త్వరలో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.