వంశీకి వెయిటింగ్ తప్పట్లేదు!
on Jul 26, 2016

'పెద్ద' డైరెక్టర్ అనే బ్రాండ్ వేసుకుంటే వచ్చే చికాకు ఇదే. బడా హీరోలతో ఓ రెండు హిట్లు పడ్డాక, మీడియం రేంజు సినిమా చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇష్టపడినా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం వెనకబడిపోతామేమో అన్న భయం. పెద్ద హీరో డేట్స్ కోసం ఎంత కాలమైన వేచి చూస్తారు గానీ, మీడియం సినిమా జోలికి వెళ్లరు. 'మిర్చి' తర్వాత కొరటాల శివ దాదాపు ఏడాది పాటు మహేష్ కోసం వేచి చూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వంశీ పైడిపల్లి పరిస్థితి కూడా ఇలానే వుంది. హ్యాట్రిక్ హిట్లు ఇచ్చాడు వంశీ. అయితే ఊపిరి తర్వాత మరో సినిమా ప్రకటన రాలేదు. అఖిల్ తో ఓ భారీ సినిమా అన్నారు . అయితే అది వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం ఏ పెద్ద హీరో డేట్స్ అందుబాటులో లేవు. మహేష్ కి ఓ కధ చెప్పాడు వంశీ. అది ఓకే అయ్యిందని అంటున్నారు. అయితే అది ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. ముందు మురగదాస్ సినిమా ఫినిష్ చేయాలి. తర్వాతే మరోటి. అంటే వంశీకి వెయిటింగ్ తప్పదన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



