అక్షయ్ 'బెల్ బాటమ్'తో వాణి రాత మారుతుందా?
on Mar 19, 2020

ఏడాదికి మినిమమ్‌లో మినిమమ్ నాలుగు సినిమాలు చేసే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అతడి పక్కన హీరోయిన్‌గా నటిస్తే చాలు... కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేదని బాలీవుడ్ బాతాఖానీ. ఎందుకంటే... కత్రినా కైఫ్, కృతి సనన్, తాప్సి సోనాక్షి సిన్హా తదితర హీరోయిన్లు అక్షయ్‌తో సినిమాలు చేసిన తర్వాత అవకాశాలు అందుకున్నారు. సేమ్ లక్ ఫ్యాక్టర్ వాణీ కపూర్‌కి కూడా పని చేస్తుందో... లేదో? నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది.
'బెల్ బాటమ్' అని అక్షయ్ కుమార్ ఒక స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో హీరో వైఫ్ క్యారెక్టర్ ఒకటి ఉంది. దానికి వాణీ కపూర్‌ని సెలెక్ట్ చేశారు. ముందు 'వన్ నేనొక్కడినే' ఫేమ్ కృతి సనన్ సిస్టర్ నుపూర్ సనన్ అనుకున్నారు. అక్షయ్ తో కలిసి ఆ అమ్మాయి ఒక వీడియో సాంగ్ చేసింది. అందుకని, ఆ పెయిర్ సినిమాలో రిపీట్ చేయాలనుకున్నారు. ఏమైందో ఏమో... చివరకి వాణీ కపూర్ దగ్గరకు వచ్చారు. 'శుద్ధ దేశి రొమాన్స్'తో 2013లో వాణీ కపూర్ కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత తెలుగులో నాని పక్కన 'ఆహా కళ్యాణం' చేసింది. రెండు భాషల్లో క్లిక్ కాలేదు. రణవీర్ సింగ్ పక్కన 'బేఫికర్' చేస్తే ప్లాప్ అయింది. లాస్ట్ ఇయర్ హృతిక్ రోషన్ 'వార్'తో హిట్ అందుకుంది. అక్షయ్ కుమార్ సినిమాతో ఆమె రాత మారుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



