బాలకృష్ణ మూవీ పాన్ ఇండియానా.. చిరంజీవి ముద్దుగుమ్మ కీలక వ్యాఖ్య
on Mar 11, 2024
నాచురల్ బోర్న్ కింగ్ బాలకృష్ణ.. అంటే ఇప్పుడు N B K కి దర్శకుడు బాబీ ఆ కొత్త అర్ధాన్ని చెప్తున్నాడు. బాలయ్య 109 మూవీ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా బాబీ ఈ విషయాన్ని రివీల్ చేసాడు. శివరాత్రికి రిలీజైన గ్లింప్స్ అయితే రికార్డులు సృష్టించే పనిలో ఉంది. బాలయ్య మరోసారి ఇండస్ట్రీ హిట్ అందుకోవడం ఖాయమని అందరు అంటున్నారు. తాజాగా ఒక హీరోయిన్ ఆ మూవీకి సంబంధించిన సీక్రెట్ ఒక దాన్ని బయటపెట్టింది.
చిరంజీవి గత సంక్రాంతి మూవీ వాల్తేరు వీరయ్య. అందులో చిరు తో కలిసి వేర్ ఈజ్ ది పార్టీ అంటూ చిందులేసిన భామ ఊర్వశి రౌటేలా. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలయ్య 109 లో కూడా నటిస్తుంది. తన ఇనిస్టాగ్రమ్ లో నా నెక్స్ట్ మూవీ బాలకృష్ణగారితో చేస్తున్నాను. అది పాన్ ఇండియా మూవీ అని చెప్పింది. ఇప్పడు ఆమె చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే తమ మూవీ పాన్ ఇండియా మూవీ అని మేకర్స్ అధికారకంగా ప్రకటించలేదు ఒక వేళ ఏమైనా ఈవెంట్ ప్లాన్ చేసి చెప్పాలనుకుంటున్నారేమో. ఈ లోపే ఊర్వశి రివీల్ చేసింది.మరీ ఆమె వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి. అంతే కాకుండా సింహం వేట మొదలయ్యింది అని కూడా ఆమె చెప్పడం గమనార్హం. ఇక అభిమానులైతే ఆమె వ్యాఖ్యలతో ఎంతో ఆనందంతో ఉన్నారు. వాళ్లంతా ఎప్పటినుంచో బాలయ్య పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ బి కే 109 గ్లింప్స్ హంగామా స్టార్ట్ అయ్యింది. ఏ ఇద్దరు కలిసినా అందులోని బాలయ్య డైలాగ్ గురించే చర్చించుకుంటున్నారు.సింహం నక్కలమీదకి వస్తే వార్ అవదురా లఫుట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్ అనే బాలయ్య డైలాగ్ ని అయితే ఫాన్స్ రిపీటెడ్ గా చూస్తున్నారు . థమన్ మరోసారి తన ఆర్ ఆర్ తో పూనకాలు తెప్పించాడని అంటున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.
Also Read